RGV: ఫిల్మ్ ఇండస్ట్రీలో నయా ట్రెండ్ సెట్ చేస్తున్న ఆర్జీవీ.. మరో మార్కెట్‌కు గేట్లు ఓపెన్..

ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ మార్కెట్‌ విస్తరిస్తోంది. ఒకప్పుడు నాటకాలు.. తరువాత సినిమాలు, సీరియళ్లు.. ఇవన్నీ దాటిన వచ్చిన కళా రంగానికి పెరుగుతున్న టెక్నాలజీ మరిన్ని కొత్త దారులు చూపిస్తోంది.

RGV: ఫిల్మ్ ఇండస్ట్రీలో నయా ట్రెండ్ సెట్ చేస్తున్న ఆర్జీవీ.. మరో మార్కెట్‌కు గేట్లు ఓపెన్..
RGV
Follow us

|

Updated on: Nov 12, 2021 | 12:20 PM

ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ మార్కెట్‌ విస్తరిస్తోంది. ఒకప్పుడు నాటకాలు.. తరువాత సినిమాలు, సీరియళ్లు.. ఇవన్నీ దాటిన వచ్చిన కళా రంగానికి పెరుగుతున్న టెక్నాలజీ మరిన్ని కొత్త దారులు చూపిస్తోంది. ప్రజెంట్ ఆన్‌లైన్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా మారుతోంది ఎంటర్‌టైన్మెంట్‌. ఓటీటీలతో హద్దులు చెరిగిపోయాయి. అయితే డిజిటల్ మీద భారతీయ ప్రేక్షకులకు పూర్తి అవగాహన రాకముందే ఇప్పుడు మరో మార్కెట్‌కు గేట్లు ఓపెన్‌ చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ.

ఎన్‌ఎఫ్‌టీ.. నాన్‌ ఫంజిబుల్ టోకెన్‌… బ్లాక్ చైన్‌. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇదే ఇప్పుడు నయా మార్కెట్‌. ప్రపంచంలోనే తొలిసారిగా తన సినిమా డేంజరస్‌ను ఎన్‌ఎఫ్‌టీలో సేల్‌కి పెట్టి చరిత్ర సృష్టించారు ఆర్జీవీ. దీంతో అసలేంటీ ఎన్‌ఎఫ్‌టీ. అందులో సినిమాను ఎలా అమ్ముతారు..? ఎలా కొంటారు? అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఎన్‌ఎఫ్‌టీ, బ్లాక్ చైన్‌ అనేది అన్ని ఓటీటీల్లా స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్ కాదు. అక్కడ జస్ట్‌ బిజినెస్ మాత్రమే జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహించేందుకు కొన్ని కంపెనీలు పనిచేస్తుంటాయి.

క్లియర్‌గా చెప్పాలంటే.. ఎన్‌ఎఫ్‌టీ ద్వారా వర్మ సినిమాలకు మనం కూడా నిర్మాతలుగా మారొచ్చు. ఎన్‌ఎఫ్‌టీలో సినిమాను సేల్ పెట్టినప్పుడు ఆ సినిమాను వాల్యూన్‌ యూనిట్స్‌గా చెబుతారు. మన ఇంట్రస్ట్‌ను బట్టి, కటెంట్‌ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి.. ఎన్ని యూనిట్లైనా కొనుక్కోవచ్చు. మీరు సొంతం చేసుకున్న యూనిట్లను బట్టీ.. సినిమా వ్యాల్యూలో మీ షేర్ డిసైడ్ అవుతుంది.

ఆ తరువాత ఆ సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయినా.. అంటే థియేట్రికల్‌ రిలీజ్ అయినా.. ఓటీటీ రిలీజ్‌ అయినా, యూట్యూబ్‌ స్ట్రీమింగ్ అయినా… శాటిలైట్‌ టెలికాస్ట్‌ అయినా.. ఆ కంటెంట్ మీద ఏ రకంగా రెవెన్యూ వచ్చినా.. అందులో మీ షేర్‌ ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లోకి వస్తుంది. ఇక్కడ లెక్కలన్నీ క్రిస్టల్ క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయంటున్నారు వర్మ. అందుకే ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఎన్‌ఎఫ్‌టీ, బ్లాక్ చైన్‌ కొత్త మార్కెట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

– సతీశ్, ET డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

Geet Saini: ఆ నటిలా పేరు తెచ్చుకోవాలని ఉంది.. ‘పుష్పక విమానం’ హీరోయిన్ గీత్ సైని ఆసక్తికర వ్యాఖ్యలు

Disney Plus Hotstar: భారత్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు భారీ షాక్.. ఏకంగా ఎంతమంది సబ్‌స్క్రయిబర్లను కోల్పోయిందంటే..