Disney Plus Hotstar: భారత్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు భారీ షాక్.. ఏకంగా ఎంతమంది సబ్‌స్క్రయిబర్లను కోల్పోయిందంటే..

డిస్నీ ప్లస్ ప్రపంచంలో టాప్ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రయిబర్లను ఇది కలిగిఉంది. దీనికి భారతీయ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కూడా అదే స్థాయిలో సబ్‌స్క్రయిబర్ల బేస్ ఉంది.

Disney Plus Hotstar: భారత్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు భారీ షాక్.. ఏకంగా ఎంతమంది సబ్‌స్క్రయిబర్లను కోల్పోయిందంటే..
Disney Plus Hotstar
Follow us
KVD Varma

|

Updated on: Nov 12, 2021 | 12:05 PM

Disney Plus Hotstar: డిస్నీ ప్లస్ ప్రపంచంలో టాప్ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రయిబర్లను ఇది కలిగిఉంది. దీనికి భారతీయ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కూడా అదే స్థాయిలో సబ్‌స్క్రయిబర్ల బేస్ ఉంది. అయితే, ఇటీవల కాలంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ నుంచి భారీస్థాయిలో వినియోగదారులు వెనక్కి తగ్గారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు దూరమైనట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. డిస్నీ ప్లస్ కు ఇది భారీ దెబ్బగానే చెప్పొచ్చు. ఇతర దేశీయ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీలు తమ సబ్‌స్క్రయిబర్ల బేస్ పెంచుకుంటుండగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ నుంచి వినియోగదారులు జారిపోవడం విశేషం.

ఈ విషయంపై డిస్నీ ప్లస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ క్రిస్టీన్ మెక్‌కార్తీ మాట్లాడుతూ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రయిబ్‌లు గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గాయని చెప్పారు. దీనికి ఐపీఎల్ మ్యాచ్ లు తక్కువగా ఉండటం ఒక కారణం అన్నారు. అంతేకాకుండా తమకు పెద్ద సాధారణ వినోద భాగం కూడా ఉందని తెలిపారు. డిస్నీ పిక్సర్, మార్వెల్, స్టార్ వార్స్ మొదలైన అన్ని విభిన్న లేబుల్‌ల కోసం మా డిస్నీ+ కంటెంట్ మొత్తం ఇక్కడ ఉంది. కానీ అదేసమయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్రతి సంవత్సరం 18,000 గంటల అసలు స్థానిక ప్రోగ్రామింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల ఈ పరిస్థితిపై కారణాలు విశ్లేషించాల్సి ఉందని చెప్పారు.

ఇదిలా ఉండగా.. వాల్ట్ డిస్నీ కంపెనీ అక్టోబర్ 2, 2021తో ముగిసిన త్రైమాసికంలో 118 మిలియన్లకు పైగా గ్లోబల్ పెయిడ్ డిస్నీ+ సబ్‌స్క్రైబర్‌లతో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కాలంలో భారత్ తప్ప మిగిలిన ప్రపంచదేశాలలో డిస్నీ ప్లస్ 60 శాతం సబ్‌ స్క్రయిబింగ్‌ రేట్‌తో సంచలనం సృష్టించింది. కానీ, గత త్రైమాసికంలో కేవలం 2.1 మిలియన్ సబ్‌స్క్రయిబర్లను మాత్రమె చేర్చుకోవడం గమనార్హం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney+Hotstar) భారతదేశంలో ఏప్రిల్ 3, 2020న ప్రారంభమైంది (ముందుగా ఉన్న హాట్‌స్టార్ సేవ డిస్నీతో కలిసి పేరు మార్చుకుంది), సెప్టెంబర్ 5, 2020న, ఇండోనేషియాలో, జూన్ 1, 2021న, మలేషియాలో అలాగే జూన్ 30, 2021న థాయిలాండ్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్రారంభామైంది.

ఇవి కూడా చదవండి: Food: మనం లొట్టలేసుకుంటూ తినే సమోసా.. ఇష్టంగా తాగే టీ మన ఫుడ్ కాదు తెలుసా? మన ఆహారంగా స్థిరపడిపోయిన విదేశీ ఆహారాలు ఇవే!

Hepatitis: డెంగ్యూతో బాధపడుతున్న వారికి కామెర్లు కూడా సోకే అవకాశం.. లక్షణాలు తెలుసుకుని జాగ్రత్త పడాలి!

U&I Neckband Earphones: తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. చాలా బ్యాటరీ బ్యాకప్ ..యూ అండ్ ఐ స్మార్ట్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్!