Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPhone Feature: ఐఫోన్ స్పెషల్ ఫీచర్.. న్యూడ్ ఫోటోలను ఇక ముందు చూడలేరు.. ఎందుకో తెలుసా..

ఐఫోన్ వినియోగదారుల కోసం యాపిల్ ఓ ప్రత్యేక ఫీచర్‌‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ న్యూడ్ ఫోటోలు( నగ్న) కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని రెడీ చేస్తోంది. పిల్లలను అశ్లీల కంటెంట్‌కు దూరంగా..

IPhone Feature: ఐఫోన్ స్పెషల్ ఫీచర్.. న్యూడ్ ఫోటోలను ఇక ముందు చూడలేరు.. ఎందుకో తెలుసా..
Iphone Made A Special Featu
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 12, 2021 | 11:29 AM

IPhone Special Feature: ఐఫోన్ వినియోగిస్తున్నవారి కోసం యాపిల్ ఓ ప్రత్యేక ఫీచర్‌‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ న్యూడ్ ఫోటోలు( నగ్న) కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని రెడీ చేస్తోంది. పిల్లలను అశ్లీల కంటెంట్‌కు దూరంగా ఉంచడం ఈ ఫీచర్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ చదవులకు తోడు స్మార్ట్‌ ఫోన్లతో నిత్యం ఆడుకుంటున్నారు పిల్లలు. ఇలాంటి సమయంలో అంతర్జాలం ఎటువైపు తీసుకెళ్తుందో కొన్ని సార్లు అర్థం కాదు. చదువల బడి కాస్తా.. అశ్లీలం వైపు వెళ్తోంది. ఈ అశ్లీల కంటెంట్ నుంచి దూరంగా ఉంచాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. అయితే తొలిసారి స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇలాంటి అంశంపై దృష్టి పెట్టంది. ఆపిల్ తాాజాగా విడుదల చేస్తున్న iOS 15.2 కోసం ఈ ఫీచర్‌ను పరీక్షించబడుతుంది. పిల్లలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. పిల్లలను అశ్లీల కంటెంట్‌కు దూరంగా ఉంచడమే ఈ ఫీచర్‌లో ఏముందన్నది ఇప్పుడు ప్రశ్న. అలాగే, ఈ ఫీచర్‌లో ప్రత్యేకత ఏమిటో.. ఇది ఎలా పని చేస్తుందో.. రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే దాని వినియోగదారు ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటుంది. పిల్లలకు ఇది ఎలా ప్రభావవంతం చేస్తుందో మనం ఓసారి తెలుసుకుందాం.

కొత్త ఫీచర్ ఎలా ఉంటుందంటే?

ఈ కొత్త ఫీచర్ సరళంగా అర్థం చేసుకున్నట్లయితే.. ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత మీ ఫోన్‌లో ఎప్పుడు న్యూడ్ ఫోటో లేదా వీడియో వచ్చినా పిల్లలు చూడలేరు. ఈ ప్రత్యేక ఫీచర్ కంటెంట్‌ను బ్లర్ చేస్తుంది. ఎవరూ సులభంగా చూడలేరు. ఇది కాకుండా పిల్లలు అలాంటి ఫైల్‌లను ఎవరికీ పంపలేరు. అంటే న్యూడ్ ఫైళ్లను పంపడం.. స్వీకరించడం కష్టమవుతుంది.

వాస్తవానికి ఎవరైనా ఫోటోను పంపినప్పుడు అది అస్పష్టంగా ఉంటుంది. అయితే, ఇలాంటి ఫోటోలను అస్సలు చూడలేరు. ఆ ఫోటోతో పాటు ఇందులోని సున్నితమైన కంటెంట్‌ను కూడా బ్లాక్ చేస్తుంది. ఆ కంటెంట్ చదివిన తర్వాత కూడా మీరు దీన్ని చూడాలనుకుంటే దానికి కూడా ఒక ఎంపిక ఉంటుంది. ఈ ఎంపిక ద్వారా మీరు కంటెంట్‌ను చూడగలుగుతారు. అయితే దీని కోసం కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాతే పిల్లల ఖాతాలో న్యూడ్ ఫోటో బ్లర్ కనిపిస్తుంది.

ఫీచర్ ఎలా పని చేస్తుంది?

ఈ ఫీచర్ కంటెంట్‌ని ముందుగా స్కాన్ చేస్తుంది. NCMEC వేలిముద్ర ద్వారా పిల్లల దుర్వినియోగ చేయకుండా ముందుగా వీడియోలు,  ఇమేజ్ డేటాబేస్ నుండి వేరు చేస్తాయి. దీనిలో, మొదట చిత్రాలు ఒక రకమైన కోడ్ హ్యాష్‌లుగా మార్చబడతాయి. తర్వాత దాన్ని చెక్  చేస్తుంది. చిత్రం అశ్లీల లేదా నగ్న చిత్రాలు అని అనిపిస్తే వెంటనే కంట్రోల్ చేస్తుంది.

గోప్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు

ఆపిల్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. కానీ గోప్యతా కారణాల వల్ల ఇది ప్రారంభించబడలేదు. అయితే, రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌ను అందబాటులోకి తీసుకువస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ ఫీచర్ కేవలం ఫోన్‌కే పరిమితం అవుతుందని కంపెనీ హామీ ఇచ్చింది.  

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..