Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..

అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. అయితే ఆ ఆలయంలో ఉండాల్సిన అమ్మవారి విగ్రహం 100 ఏళ్ల క్రితం కెనడా చేరింది. ఎవరు ఆలయం..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..
Annapurna
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 11, 2021 | 2:46 PM

Maa Annapurna idol: సాక్షాత్ పరమశివుడికే ఆహారాన్ని భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ. కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది, కాశీ విశ్వనాధుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. అయితే ఆ ఆలయంలో ఉండాల్సిన అమ్మవారి విగ్రహం 100 ఏళ్ల క్రితం కెనడా చేరింది. ఎవరు ఆలయం నుంచి అక్కడికి తీసుకెళ్లారు.. ఎలా తీసుకెళ్లారు.. ఎందుకు తీసుకెళ్లారు అనేది తెలియకపోయినా.. చోరీ జరిగిన ఈ విగ్రహం ఇంత కాలం తర్వాత భారత్ చేరింది.  18వ శతాబ్దికి చెందిన విగ్రహం- 100 ఏళ్ల క్రితం చోరీ- 4 ఏళ్ల కృషి- ఈ ఆగస్ట్ లో భారత్ చేరిక.. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా.. ఉత్తర ప్రదేశ్ మంత్రులకు అందజేత.. ఈ నెల 15న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా.. యదాస్థానంలో పునఃప్రతిష్ట. ఏంటీ మాతా అన్నపూర్ణ విగ్రహం వెనక దాగిన కథనం.. ఈ మూర్తి- ఇక్కడి నుంచి కెనడా వరకూ ఎలా వెళ్లింది? తిరిగి స్వస్థలం ఎలా చేరుకోనుందీ?

అన్నపూర్ణే సదాపూర్ణే – శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం – భిక్షాం దేహీచ పార్వతి

అంటూ భారతదేశంలో అన్నపూర్ణాదేవిని అర్చిస్తుంటారు.. ఈ చరాచర సృష్టికి ఆకలిదప్పులు తీర్చే అమ్మగా.. అన్నపూర్ణను కొలవడం ఇక్కడి సనాతన సంప్రదాయం.. సాక్షాత్ విశ్వనాథుడికే ఆకలితీర్చిన అమ్మ అన్నపూర్ణమ్మ.. భారతీయ మనోభావాలను కదిలిస్తాయి. ఎందుకంటే కాశీ భారతీయుల మోక్ష మార్గం చూపే నగరం. ఇక్కడి విశ్వనాథుడి దర్శనం సర్వపాప హరణం కాగా.. మా గంగా దప్పిక తీర్చే దయానిథి.. ఇక మాతా అన్నపూర్ణ ఆకలిదప్పులను తీర్చే చల్లనితల్లి. భక్తుల పాలిట కల్పవల్లి.

ఆ మూర్తి మరెవరిదో కాదు.. సాక్షాత్ అన్నపూర్ణాదేవిది. కాశీ నివాసిని అయిన అమ్మవారు.. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన విగ్రహమూర్తి. ఎవరు ఎప్పుడు దొంగలించారో తెలీదు కానీ.. ఈ అన్నపూర్ణమ్మ విగ్రహం కెనడా చేరింది. అక్కడి చారిత్రక విగ్రహాలు, వస్తువులుండే చోట స్థిరపడింది.

మోదీ ప్రభుత్వం వచ్చాక.. విదేశాల్లో ఉన్న భారత సాంస్కృతిక చారిత్రక సంపదను తిరిగి రప్పించే మహాయజ్ఞం ఒకటి జరుగుతోంది. అందులో భాగంగా.. ఈ విగ్రహం తిరిగి వారణాసిని చేర్చే యత్నం ప్రారంభించింది. నాలుగేళ్ల నాటి నుంచి కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అనేకానేక తర్జన భర్జనలు- సంప్రదింపులు- చర్చోపచర్చలు- సాగించిన కెనడా ప్రభుత్వం.. అన్నపూర్ణాదేవి భారతీయులకు ఎంతటి విలువైన సాంస్కృతిక సంపదో గుర్తించింది. ఇరు దేశాల మధ్య విగ్రహం విషయంలో ఒక ఒప్పందం కుదిరింది. ఈ విగ్రహాన్ని భారత్ కు అప్పగించడానికిసర్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్ట్ లో కెనడా నుంచి అమ్మవారు తిరిగి భారత్ చేరుకున్నారు.

ఈ రోజు కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి.. ఉత్తర ప్రదేశ్ మంత్రులకు ఈ విగ్రహాన్ని అందజేశారు. విగ్రహం అందిన వెంటనే మాతా అన్నపూర్ణను నాలుగు రోజుల పాటు యాత్రగా తీసుకెళ్లి.. ఈ నెల 15వ తేదీన.. యదా స్థానంలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచ్చేయనున్నారు.

అలా అన్నపూర్ణమ్మ.. కాశీ నుంచి బయలెళ్లి.. తిరిగి అదే స్థానానికి చేరడంతో.. భారతీయుల ఆనందానికి అవథుల్లేవు..

ఇవి కూడా చదవండి: Makeup Tips: కూతురి పెళ్లిలో తల్లి ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు గ్రేస్‌ఫుల్ లుక్..

SBI: ఎస్‌బీఐలో ఈ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ..

Chanakya Niti: కష్టాల్లో ఉన్నారా.. ఇలా ధృ‌ఢంగా ఉండండి.. అదే మీ విజయానికి పూలబాట..

Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..