Kartik Purnima: కార్తీక పౌర్ణమిరోజున పాక్షిక చంద్రగ్రహణం.. మనదేశంలో ఎక్కడ కనిపించనున్నదంటే..

Kartik Purnima- Lunar Eclipse: ఈ నెల 19న కార్తీక పున్నమి. హిందువులు పవిత్రంగా కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే ఇదే రోజున ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన..

Kartik Purnima: కార్తీక పౌర్ణమిరోజున పాక్షిక చంద్రగ్రహణం.. మనదేశంలో ఎక్కడ కనిపించనున్నదంటే..
Lunar Eclipse 2021
Follow us

|

Updated on: Nov 11, 2021 | 8:14 PM

Kartik Purnima- Lunar Eclipse: ఈ నెల 19న కార్తీక పున్నమి. హిందువులు పవిత్రంగా కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే ఇదే రోజున ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం దర్శనమివ్వబోతుంది. ఏడాది చివరి చంద్రగ్రహణ సమయం గురించి నాసా ప్రకటించింది. ఈ గ్రహణం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 18,19 తేదీల్లో కనిపించనుండగా.. భారత దేశంలో మాత్రం నవంబరు 19న ఈశాన్య భారతదేశంలో మాత్రమే అతి తక్కువ సమయం పాటు కనిపించనున్నదని తెలిపింది. 2021 సంవత్సరపు చివరి చంద్రగ్రహణం భారతకాలమానం ప్రకారం ఈనెల 19 మధ్యాహ్నం 1.30 గంటలకు ఏర్పడనుంది. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.

ఈ ఏడాదిలో తొలి చంద్ర గహణం.. మే 26 రోజున (వైశాఖ పౌర్ణమి) నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడగా.. ఇది రెండో చంద్రగ్రహణం.. అంతేకాదు ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా. కార్తీక పున్నమి రోజున ఏర్పడే చంద్రగ్రహణం భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో దర్శనమివ్వనుంది. ఇక ఉత్తర అమెరికాలోని 50దేశాలతో పాటు మెక్సికోలో కూడా చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా., పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది.

కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడనున్న పాక్షిక గ్రహణాన్ని ‘ఫ్రాస్ట్‌ మూన్‌’గా పిలుస్తారు. ఎందుకంటే మంచుతో కప్పబడిన చంద్రుడిని ఫ్రాస్ట్ మూన్ అంటారు.అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరు పెట్టారు. ఇక కార్తీక పూర్ణిమని హిందువు ఘనముగా జరుపుకుంటారు. ఆరోజు ప్రవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తారు. విష్ణువును పూజిస్తారు.

Also Read:  రైలును నిమిషం ఆలస్యంగా నడిపినందుకు డ్రైవర్‌కు ఫైన్.. న్యాయం జరిగేవరకూ పోరాడతా అంటున్న రైల్వే డ్రైవర్..