Drushyam 2 Movie: థ్రిల్లర్ మూవీ దృశ్యం 2 టీజర్ విడుదల.. అమెజన్‌ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

Drushyam 2 official teaser: అమెజాన్ ప్రైమ్ వీడియో.. మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. టాలీవుడ్ నటుడు

Drushyam 2 Movie: థ్రిల్లర్ మూవీ దృశ్యం 2 టీజర్ విడుదల.. అమెజన్‌ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
Drishyam 2
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 12, 2021 | 1:38 PM

Drushyam 2 official teaser: అమెజాన్ ప్రైమ్ వీడియో.. మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సూపర్హిట్ చిత్రం ‘దృశ్యం’ సినిమాకు ఇది సీక్వెల్. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ నటించారు. సంపత్ రాజ్, పూర్ణ కొత్త పాత్రల్లో కనిపించారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్కుమార్ థియేటర్స్ మరియు మాక్స్ మూవీస్ నిర్మాతలుగా.. దృశ్యం సినిమాకు సిక్వెల్‌గా దృశ్యం 2 సినిమా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో నవంబర్ 25న విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇండియా సహా.. అన్ని దేశాల ప్రైమ్ మెంబర్స్ 25 నవంబర్ 2021 నుంచి తెలుగు థ్రిల్లర్ దృశ్యం 2 ఎక్స్ క్లూజివ్ డిజిటల్ ప్రీమియర్‌ని స్ట్రీమ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్కు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కస్టమర్లు దృశ్యం 2 మూవీని కూడా చూడవచ్చు. ఈ దృశ్యం 2 సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆరు సంవత్సరాల క్రితం విడుదలైన దృశ్యం చిత్రం.. అప్పుడు బాక్సాఫీస్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. దానికి సిక్వెల్‌గా నిర్మించిన దృశ్యం 2 చిత్రంలో రాంబాబు జీవితంలోని మార్పులను చూపించనున్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మారిన పరిస్థితులు, మిస్టరీ, క్రైమ్-డ్రామాను ఆసక్తికర రీతిలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి ట్విస్ట్ ప్రక్షేకులను ఆకట్టుకునేలా రూపొందించారు. కాగా.. దృశ్యం 2 చిత్రం హక్కులను ప్రైమ్ సొంతం చేసుకుని.. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా టీజర్ ను రిలీజ్ చేసింది.

టీజర్.. Also Read:

Biscuits Side Effects: టీతో కలిపి బిస్కెట్లు తింటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..

Bengaluru Express: భారీ వర్షాలకు రైలుపై విరిగిపడిన కొండచరియలు.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!