Bengaluru Express: భారీ వర్షాలకు రైలుపై విరిగిపడిన కొండచరియలు.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్..
Kannur-Bengaluru Express: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో.. బెంగళూరు ఎక్స్‌ప్రెస్
Kannur-Bengaluru Express: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో.. బెంగళూరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ధర్మపురం జిల్లాలోని తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. ఏ ఒక్కరు కూడా గాయపడలేదని, ప్రాణనష్టం సంభవించలేదని నైరుతి రైల్వే అధికారులు స్పష్టంచేశారు. ప్రమాదం సమయంలో రైలులో 2348 మంది ఉన్నారని, ఏ ఒక్కరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఈ ట్రైన్ కున్నూర్ నుంచి బెంగళూరుకి వెళుతుండగా.. తెల్లవారుజామున 3.50 గంటల ఈ ఘటన చోటుచేసుకుంది. 5 బోగీలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడడంతో ట్రైన్ పట్టాలు తప్పింది. ఐదు భోగీలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు.
Around 3.50 am today, 5 coaches of Kannur-Bengaluru Express derailed b/w Toppuru-Sivadi of Bengaluru Division, due sudden falling of boulders on the train. All 2348 passengers on board are safe, no casualty/injury reported: South Western Railway (SWR)
(Photo source: SWR) pic.twitter.com/Yq9hhxIkQo
— ANI (@ANI) November 12, 2021
రైలు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు ప్రకటించారు.
Also Read: