India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఒక్కసారిగా
India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు ఉపశమనం కలిస్తున్నాయి. బుధవారంతో పోల్చుకుంటే.. గురువారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,516 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 1,37,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 267 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.26 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 1.07శాతం ఉంది.
తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,14,186 కి చేరగా.. మరణాల సంఖ్య 4,62,690 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 13,155 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3.38,14,080 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 110.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు 62.10 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
????? ?????https://t.co/hcq8TTsfk4 pic.twitter.com/A1ue5OrgXE
— Ministry of Health (@MoHFW_INDIA) November 12, 2021
Also Read: