Narendra Modi : “ది కాశ్మీర్ ఫైల్స్” పై ప్రధాని మోడీ ప్రశంసలు.. ప్రతి ఒక్కరూ చూడాలని సూచన

కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Narendra Modi : ది కాశ్మీర్ ఫైల్స్ పై ప్రధాని మోడీ ప్రశంసలు.. ప్రతి ఒక్కరూ చూడాలని సూచన
Narendra Modi
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 15, 2022 | 4:44 PM

Narendra Modi : కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ  చిత్రయూనిట్‌ను అభినందించారు. దర్శకుడు వివేక్‌ అగ్రిహోత్రి, నిర్మాతలు పల్లవి జోషి, అభిషేక్‌ అగర్వాల్‌ ప్రధానిని కలిసిన వాళ్లలో ఉన్నారు. వారి పై మోడీ ప్రశంసలు కురిపించారు. తాజాగా మరోసారి ప్రధాని ఈ మూవీ గురించి మాట్లాడారు. “ది కాశ్మీర్ ఫైల్స్” చాలా మంచి సినిమా. మీరందరూ చూడాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి” అని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం నాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన వారందరినీ కొత్తగా విడుదల చేసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇది చాలా మంచి సినిమా అని, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన అన్నారు.

వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. మరో వైపు సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విపరీతమైన ప్రశంసలు రావడంతో జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక ప్రధాని సైతం ఈ సినిమా పై పొగడ్తలు కురిపించడంతో ప్రజల్లో ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది. “ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సరికొత్త రికార్డులు, చరిత్ర సృష్టిస్తోంది. తొలిరోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆదివారం నాటికి సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000కి పెరిగింది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపు అయ్యాయి. పెద్ద స్టార్లు లేకుండా దాదాపు 12 కోట్ల రూపాయలతో 27 కోట్లకు పైగా బిజినెస్ చేసింది ‘ది కాశ్మీర్ ఫైల్స్’.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?