Pakistani Actress: త‌ల్లికాబోతున్న పాకిస్థాన్ అందాల తార సారాఖాన్‌.. వైర‌ల్‌గా మారిన బేబీ బంప్ ఫొటోలు..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jun 21, 2021 | 8:05 PM

Pakistani Actress: పాకిస్థాన్‌కు చెందిన ప్ర‌ముఖ న‌టీమ‌ణి సారాఖాన్ త‌ల్లికాబోతోంది. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్వ‌యంగా ప్ర‌క‌టించింది. భ‌ర్త ఫాల‌క్ ష‌బ్బిర్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ...

Pakistani Actress: త‌ల్లికాబోతున్న పాకిస్థాన్ అందాల తార సారాఖాన్‌.. వైర‌ల్‌గా మారిన బేబీ బంప్ ఫొటోలు..
Sarah Khan Pakisthan Actress

Pakistani Actress: పాకిస్థాన్‌కు చెందిన ప్ర‌ముఖ న‌టీమ‌ణి సారాఖాన్ త‌ల్లికాబోతోంది. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్వ‌యంగా ప్ర‌క‌టించింది. భ‌ర్త ఫాల‌క్ ష‌బ్బిర్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌తో గుడ్ న్యూస్ పంచుకుంది. ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేసిన బేబీ బంప్ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. తాను త‌ల్లిని కాబోతున్నాను అని ప్ర‌క‌టించిన సారా.. ఖురాన్‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్‌ను రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు చెందిన ప్ర‌ముఖ న‌టీమ‌ణుల్లో సారా ముందు వ‌రుస‌లో ఉంటుంది. సౌదీ అరేబియాలో జ‌న్మించిన సారాఖాన్ పాకిస్థాన్‌లో మంచి న‌టిగా గుర్తింపు సంపాదించుకుంది. సారా 2012లో తొలిసారి బాడీ అపా అనే టీవీ కార్య‌క్ర‌మం ద్వారా తెర‌గేంట్రం చేసింది. ఇక 2015లో వచ్చిన అల్విదా సినిమాలో నెగిటివ్ రోల్ న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. సారాఖాన్ వివాహం 2020లో జ‌రిగింది. సారాఖాన్ త‌ల్లికాబోతోంద‌ని తెలిసిన ఆమె అభిమానులు శుభాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

సారాఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు..

View this post on Instagram

A post shared by Mrs.Falak (@sarahkhanofficial)

Also Read: Vijay Birthday: గ‌న్ను ప‌ట్టుకున్న ‘మృగం’.. విజ‌య్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ చూశారా..? హాలీవుడ్ స్థాయిలో..

MAA Elections: మా అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు. పోటీ.. మెగా వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీగా మార‌నుందా..?

Anchor Pradeep: ఏపీ రాజ‌ధానిపై స్పందించిన ప్ర‌దీప్‌.. ఎవ‌రినైనా ఇబ్బంది పెడితే క్ష‌మించండి అంటూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu