MAA Elections: మా అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు. పోటీ.. మెగా వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీగా మార‌నుందా..?

MAA Elections: తెలుగు సినిమా నటీనటుల సంఘం `మా` అధ్య‌క్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌కాశ్ రాజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే...

MAA Elections: మా అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు. పోటీ.. మెగా వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీగా మార‌నుందా..?
Manchu Vishnu In Maa
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 21, 2021 | 5:25 PM

MAA Elections: తెలుగు సినిమా నటీనటుల సంఘం `మా` అధ్య‌క్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌కాశ్ రాజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌కాశ్ రాజ్ స్వ‌యంగా తానే ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే ప్ర‌కాశ్ రాజ్‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌మ మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ప్ర‌కాశ్‌రాజ్‌కు ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మా అధ్యక్ష బ‌రిలోకి హీరో మంచు విష్ణు దిగుతున్న‌ట్లు తెలుస్తోది. మంచు విష్ణు త్వ‌ర‌లోనే త‌న ప్యాన‌ల్ స‌భ్యుల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మ‌చారం. ప్ర‌స్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న న‌రేష్ మ‌ద్ద‌తు విష్ణుకు ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఓవైపు మెగా ఫ్యామిలీ మ‌ద్దతు ఇస్తోన్న ప్ర‌కాశ్ రాజ్‌, మ‌రోవైపు మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు విష్ణు బ‌రిలోకి దిగుతుండ‌డంతో ఈసారి మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారనున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే సినీ పెద్ద‌లు ఈ విష‌యంలో త‌ల‌దూర్చి ఎవ‌రినైనా పోటీ నుంచి విర‌మించి ఏక గ్రీవంగా ఎన్నిక చేస్తారా.? లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మా ఎన్నిక‌ల్లో తాను పోటీచేస్తున్న‌ట్లు తెలిపిన ప్ర‌కాశ్ రాజ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా మా అసోసియేషన్‌‌కి అధ్యక్షుడిగా మంచి సేవలు అందించగలనన్న నమ్మకం తనకుందని చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్‌ మీకు ఉంటుందా..? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చిరు అందరివాడని.. మంచి వాళ్లకే మద్దతు ఇస్తారని అన్నాడు.

Also Read: Anchor Pradeep: ఏపీ రాజ‌ధానిపై స్పందించిన ప్ర‌దీప్‌.. ఎవ‌రినైనా ఇబ్బంది పెడితే క్ష‌మించండి అంటూ..

In The Name Of God: ప్రియ‌ద‌ర్శి విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌కు ఫిదా అవుతోన్న ప్రేక్ష‌కులు.. ‘ఆహా’ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌తో..

Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!