Narappa Trailer: మరోసారి విశ్వరూపం చూపించిన వెంకటేశ్.. “నారప్ప” ట్రైలర్ అదుర్స్..

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Rajitha Chanti

Updated on: Jul 14, 2021 | 3:41 PM

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం "నారప్ప". ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి నటిస్తోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ "అసురన్"

Narappa Trailer: మరోసారి విశ్వరూపం చూపించిన వెంకటేశ్.. నారప్ప ట్రైలర్ అదుర్స్..
Narappa

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం “నారప్ప”. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి నటిస్తోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ “అసురన్” చిత్రానికి రీమేక్‏గా నారప్ప సినిమాను వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్.థాసు, సురేష్ బాబు కలిసి నిర్మించారు. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా.. అమెజాన్ ప్రైమ్‏లో జూలై 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో “నారప్ప” సినిమా ట్రైలర్‏ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఇక ట్రైలర్ చూస్తుంటే.. అసురన్ సినిమాలో పెద్దగా మార్పులు చేయకుండానే నారప్ప మూవీని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇందులోని సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉన్న వెంకటేష్ చేతిలో ఒక కత్తి పట్టుకొని కోపంతో శత్రువులను వేటాడానికి బయలుదేరడంతో ట్రైలర్ ప్రారంభమైంది. అలాగే ఇందులో ప్రియమణి పాత్రను కూడా చూపించారు. ఎప్పుడూ మన ముందు చేతులు కట్టుకుని నిల్చునే వాళ్లలో ఇప్పుడు ఆ భయం ఎలా పోయింది ? అనే విలన్ వాయిస్ వింటే… కులవ్యవస్థ నేపథ్యంలో సినిమా తెరకెక్కిన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో వెంకీ ముగ్గురు పిల్లల తండ్రిగా కనిపించాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో వెంకటేష్ తన విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. చివర్లో ‘రా నరకరా.. ఎదురు తిరిగి కసిగా నరకరా..’ అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు నారప్ప కత్తితో రౌడీలను నరికే యాక్షన్ సీన్స్ మాస్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయంగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నాజర్, రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించాడు.

ట్రైలర్ ‘ట్వీట్..

ట్రైలర్..

Also Read: Dia Mirza: మే నెలలో కొడుకు.. రెండు నెలలుగా ఐసీయూలోనే.. తన కుమారుడి పేరును చెప్పిన దియా మీర్జా..

ఒకప్పుడు పాకెట్ మనీ లేని అమ్మాయి.. ఇప్పుడు కోట్లలో పారితోషికం.. చెదు అనుభవాలను గుర్తుచేసుకున్న అందాల కరీనా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu