AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dia Mirza: మే నెలలో కొడుకు.. రెండు నెలలుగా ఐసీయూలోనే.. తన కుమారుడి పేరును చెప్పిన దియా మీర్జా..

బాలీవుడ్ నటి దియా మీర్జా దంపతులు తల్లిదండ్రులయ్యారు. బాబు పుట్టిన రెండు నెలల తర్వాత ఆ విషయాన్ని దియా మీర్జా అభిమానులకు వెల్లడించింది. తమ బాబు చేతులను తమ చేతుల్లోకి తీసుకున్న

Dia Mirza: మే నెలలో కొడుకు.. రెండు నెలలుగా ఐసీయూలోనే.. తన కుమారుడి పేరును చెప్పిన దియా మీర్జా..
Dia Mirza
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 14, 2021 | 3:08 PM

Share

బాలీవుడ్ నటి దియా మీర్జా దంపతులు తల్లిదండ్రులయ్యారు. బాబు పుట్టిన రెండు నెలల తర్వాత ఆ విషయాన్ని దియా మీర్జా అభిమానులకు వెల్లడించింది. తమ బాబు చేతులను తమ చేతుల్లోకి తీసుకున్న ఫోటోను తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేస్తూ.. దియా మీర్జా ఎమోషనల్ ట్వీట్ చేశారు. బాబుకు “అవ్యాన్ ఆజాద్ రేఖి ” అనే పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో “మా బాబు అవ్యాన్ మే 14న జన్మించాడు. అనుకున్న సమయం కంటే ముందుగానే జన్మించాడు. కానీ అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నాడు. ప్రస్తుతం మా బాబు క్షేమంగానే ఉన్నాడు. త్వరలోనే ఇంటికి రాబోతున్నాడు. మా బాబును ఎత్తుకునేందుకు అవ్యాన్ అక్కతోపాటు.. అతడి నానమ్మ, తాతయ్యలు కూడా ఎదురుచూస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా.. దియా మీర్జాకు అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 15న దియా మీర్జా.. తన ప్రియుడు వైభవ్ రాఖీని ముంబైలో వివాహం చేసుకుంది. ఇక పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఆమె నిర్మోహమాటంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గతంలో దియా మీర్జా.. నిర్మాత సాహిల్ సంఘాను వివాహం చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత అతడికి విడాకులు ఇచ్చింది దియా. ఇటీవల నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాతో దియా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ట్వీట్..

Also Read: ఒకప్పుడు పాకెట్ మనీ లేని అమ్మాయి.. ఇప్పుడు కోట్లలో పారితోషికం.. చెదు అనుభవాలను గుర్తుచేసుకున్న అందాల కరీనా..

Sumanth Akkineni: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న అక్కినేని హీరో.. దుల్కర్ సల్మాన్ మూవీలో కీలక పాత్రలో సుమంత్ ?

Anita: ముద్దుల కొడుకుతో నటి అనిత హసానందాని..సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్.

Virata Parvam​ : ఓటీటీ కే ఓటేస్తున్న బడా ప్రొడ్యూసర్.. విరాటపర్వం కూడా అదే దారిలో..