Shanaya Kapoor: అమ్మో.. ఏం తిప్పేసిందిరోయ్.. బెల్లి డ్యాన్స్‌తో అదరగొట్టిన షానయ..
సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించాలంటే అందంతోపాటు టాలెంట్ కూడా అవసరం. అది టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడైనా సరే హీరోయిన్‌గా మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. నటనతోపాటు డ్యాన్స్ ఖచ్చితంగా రావాలి...
సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించాలంటే అందంతోపాటు టాలెంట్ కూడా అవసరం. అది టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడైనా సరే హీరోయిన్‌గా మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. నటనతోపాటు డ్యాన్స్ ఖచ్చితంగా రావాలి… అందులోనూ స్పెషలైజేషన్ తప్పనిసరి. తమ టాలెంట్‌ను ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం కూడా అవసరం. ఇలా రాణించడానికి హీరోయిన్‌లు, అప్‌కమింగ్ యాక్టర్స్ ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. ముద్దుగుమ్మల అందాలు.. ఒంపు సొంపులను బాగా చూపించాలంటే మాత్రం బెల్లీ డ్యాన్స్‌లోనే అని అంటారు కొరియో గ్రాఫర్లు. ఇప్పటికే చాలా మంది బీ టౌన్ హీరోయిన్లు బెల్లీ బేబీలుగా అదరగొట్టారు… వీరు చేసిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలోకి సంజయ్ కపూర్ కుమార్తె, అప్ కమింగ్ హీరోయిన్ షనయా కపూర్ చేరారు. ప్రస్తుతం ఈమె చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో సామాజిక మద్యాలను కుదుపులు గురి చేస్తోంది. షన చేసిన డ్యాన్స్‌ను అద్బుతం అంటుంటే.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా చేసిన కామెంట్ మాత్రం తెగ నవ్వలు తెప్పిస్తోంది.
బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది షనయా కపూర్. ‘‘మేం డ్యాన్స్ ఎలా నేర్చుకుంటామంటే ప్రాక్టీస్ సెషన్స్ విత్ బెస్ట్ సంజన ముత్రేజా అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు షనయా కపూర్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై బిగ్ బీ మనవరాలు నవ్య నవేలీ నందా కాస్త వెరైటీగా కామెంట్ చేశారు. ‘‘నీ డ్యాన్స్ చూస్తే.. నాకు కడుపునొప్పి వస్తుంది’’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు నవ్య నవేలీ.
View this post on Instagram