Viral Photo: అనుష్క శర్మ సెల్ఫీ వైరల్.. అందరి దృష్టి వాచ్ పైనే.. ధర తెలిస్తే… షాకవ్వాల్సిందే!

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Venkata Chari

Updated on: Jul 14, 2021 | 4:29 PM

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, తన భర్త విరాట్ కోహ్లీ, కూతురు వామికాలతో కలిసి ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు ఇంగ్లండ్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు.

Viral Photo: అనుష్క శర్మ సెల్ఫీ వైరల్.. అందరి దృష్టి వాచ్ పైనే.. ధర తెలిస్తే... షాకవ్వాల్సిందే!
Anushka Sharma Virat Kohli Photos

Anushka Sharma: బాలీవుడ్ నటి అనుష్క శర్మ, తన భర్త విరాట్ కోహ్లీ, కూతురు వామికాలతో కలిసి ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు ఇంగ్లండ్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. నిన్ననే(మంగళవారం జులై 13న) వారి కుమార్తే 6వ నెల పుట్టిన రోజు వేడుకలను ఓ పార్క్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, నేడు మరో ఫొటోతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది అనుష్క శర్మ. యూకేలో ఉన్నా సరే ఫ్యాన్స్‌కు మాత్రం సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ అలరిస్తోంది. తల్లి అయిన తరువాత నుంచి కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది ‘పారీ’ నటి. ఈ ఏడాది జనవరిలో వామికా పుట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఈ ఫొటోలో తన హెయిర్ కట్‌తో పాటు ఖరీదైన వాచ్‌ను ధరించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అనుష్క శర్మ బ్లాక్ అండ్ వైట్ టాప్ ధరించి ఫొటోకు ఫోజులిచ్చింది. తన చేతికి ఉన్న రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ గురించే అనుష్క ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వాచ్ ధర ఎంతో తెలుసా.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అనుష్క ధరించిన రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే ఎవెరోస్ గోల్డ్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఆటోమేటిక్ మెన్స్ వాచ్ ధర 65,879 డాలర్లు (అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 50లక్షలు). వాచ్‌ను చూసిన అభిమానులంతా నోరెళ్లబెడుతున్నారు. అంత ఖరీదైన వాచ్‌ను ధరించావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anushka Sharma Rolex Watch

విరాట్, అనుష్కలు మొదట ఓ కమర్షియల్ యాడ్‌లో కలుసుకున్నారు. అనంతరం ఈ జంట ప్రేమికులుగా మారి ప్రపంచమంతా చక్కర్లు చుట్టేశారు. ఆతరువాత 2017 డిసెంబర్ 11 న వివాహం చేసుకున్నారు. వీరి వివాహాం ఇంగ్లండ్‌లో కొద్దిమంది స్నేహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. అనంతరం ముంబై, ఢిల్లీలో వివాహ విందును ఏర్పాటుచేశారు. అనుష్క చివరి సారిగా 2018లో జీరో సినిమాలో నటించింది. ఇందులో షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా నటించారు. ఆ తరువాత నిర్మాతగా మారిన అనుష్క శర్మ పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి, ఓటీటీలో విడుదల చేసింది. ఇందులో పటల్ లోక్, బుల్బుల్ సిరీస్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఖాలా అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది.

Also Read:

Krishna: చంద్రబాబు టూర్ లో మళ్ళీ ఊహించని షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు… ( వీడియో )

పెంపుడు పిల్లి మిస్సింగ్..!! పిల్లి ఆచూకీ చెబితే 30 వేల రివార్డు మీ సొంతం..!! ( వీడియో )

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu