Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Mobile Tips: వర్షంలో మీ ఫోన్ తడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇలా చేస్తే మీ మొబైల్ భద్రమే..

గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోజూ ఉద్యోగాలు, పని మీద బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్నిసార్లు ఆకస్మాత్తుగా వర్షం పడడం

Monsoon Mobile Tips: వర్షంలో మీ ఫోన్ తడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇలా చేస్తే మీ మొబైల్ భద్రమే..
Smart Phone
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 14, 2021 | 6:59 PM

గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోజూ ఉద్యోగాలు, పని మీద బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్నిసార్లు ఆకస్మాత్తుగా వర్షం పడడం వలన పూర్తిగా తడిపోవడంతోపాటు.. మన దగ్గర గ్యాడ్జెట్స్ కూడా వర్షపు నీటిలో తడిసిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అతి ముఖ్యమైన వస్తువు. వయసుతో సంబంధం లేకుండా.. అందరూ స్మార్ట్ ఫోన్స్‏తో గంటలు గంటలు గడిపేస్తున్నారు. అయితే బయటకు వెళ్లినప్పుడు మీ స్మార్ట్ ఫోన్ తడిపోతుందా ? దీంతో మొబైల్ పనిచేయకపోవడం.. ఆగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా.. వర్షంలో మీ ఫోన్ తడవకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుంది. అవెంటో తెలుసుకుందామా.

* వాటర్ ప్రూఫ్ కవర్.. వర్షాకాలంలో బయటకు వెళ్లే సమయంలో మీ దగ్గర మొబైల్ వాటర్ ప్రూఫ్ కవర్ ఉండడం మంచిది. ఇది మీ ఫోన్‏ను కప్పేస్తుంది. దీంతో ఎంతటి వర్షంలోనైనా మీరు మొబైల్ ఉపయోగించవచ్చు. దీని వలన మీ పనులకు ఆటంకం కలగకుండా ఉండడమే కాకుండా.. ఫోన్ కూడా సురక్షితంగా ఉంటుంది. ఇవి ఆన్‏లైన్ సైట్స్‏లలో రూ.100-200 లేదా రూ.300 వరకు ఉంటాయి.

* బ్లూటూత్స్, ఇయర్ ఫోన్స్.. వర్షాకాలంలో నేరుగా మొబైల్ వాడకుండా.. ఎక్కువగా బ్లూటూత్స్, ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం మంచిది. తద్వారా ఫోన్లను ప్రతిసారీ బయటకు తీయాల్సిన పని ఉండదు. అంతేకాకుండా.. ఇవి ఎక్కువగా నీటిలో తడిసే అవకాశం ఉండదు.

* పాలిబాగ్.. మీరు బయట ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా వర్షం పడితే.. వెంటనే మీ మొబైల్‏ను పాలిబాగ్ లేదా పాలిథిన్ కవర్‏తో గట్టిగా చూట్టేయ్యాలి. ఇలా చేయడం వలన ఫోన్ వర్షంలో తడవదు. వర్షం తగ్గిన తర్వాత పాలిథిన్ కవర్ తొలగించి.. వస్త్రంతో క్లీన్ చేసుకోవాలి.

* సిలికా జెల్ ప్యాకెట్స్.. వర్షంలో ఫోన్ తడవకుండా ఉండాలంటే.. జిప్‏లాక్ ఉన్న సిలికా జెల్ ప్యాకెట్స్ ఉపయోగించడం మంచిది. వీటి ద్వారా వర్షం నీరు ఫోన్ లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఆన్‏లైన్ సైట్స్‏లో కూడా లభిస్తాయి.

వర్షంలో ఫోన్ తడిస్తే ఏం చేయాలంటే.. వర్షంలో ఫోన్ తడిస్తే.. వెంటనే బ్యాటరీ తీసివేయడం మంచిది. తడిసిన ఫోన్‏కు ఛార్జ్ పెట్టకూడదు. అలాగే ఫోన్‏ను ఆరబెట్టడానికి ఎయిర్ డ్రయ్యర్‏ను ఉపయోగించకూడదు. ఒకవేళ మీ ఫోన్ వర్షంలో తడిస్తే.. దానిని రాత్రంతా బియ్యంలో పెట్టాలి. ఫోన్ తడిసిపోయిన తర్వాత పాలిథిన్ కవర్ ఎట్టి పరిస్థితులలో చుట్టకూడదు. ఎందుకంటే.. ఫోన్ కు గాలి తగలదు. ఫోన్ లో తేమ ఉండడం వలన సర్క్యూట్లను దెబ్బతీస్తుంది. ఫోన్ తడిసిపోయినప్పుడు వెంటనే దాని భాగాలను విడదీయకూడదు. అలా చేస్తే.. లోపలి భాగాల్లోకి నీరు వెళ్లిపోతుంది. తడిసిన మొబైల్ ను బల్బ్ కింద.. గ్యాస్ దగ్గర పెట్టకూడదు. ఇలా చేయడం వలన ఫోన్ లో ఉన్న లోపలి భాగాలకు హానీ కలుగుతుంది. సహజ వేడిలో మాత్రమే ఉంచాలి.తడిసిన ఫోన్ ను కొద్ది సమయం వరకు ఉపయోగించకూడదు. ఈ సమయంలో పేలిపోయే అవకాశం ఉంది.

Also Read: Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..