Enemy Movie: ఓటీటీలో సందడి చేయనున్న మరో సూపర్ హిట్ మూవీ.. ఎనిమి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఎనిమి. ఈ సినిమాలో మ్యాన్లీ స్టార్ ఆర్య లీడ్ రోల్ పోషించాడు.
తమిళ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఎనిమి(Enemy). ఈ సినిమాలో మ్యాన్లీ స్టార్ ఆర్య (Aarya) లీడ్ రోల్ పోషించాడు. వీరిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎనిమి చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా.. మిని స్టూడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాలిని రవి హీరోయిన్‌గా నటించగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది నవంబర్ నెలలో తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు విశాల్, ఆర్య.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఎనిమి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ దక్కించుకుంది. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో సోనిలివ్ వేదికగా స్ట్రీమింగ్ చేయనుంది. మిత్రులుగా ఉన్న విశాల, ఆర్యలు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది.. ఇద్దరి మధ్య సాగే పోరులో పై చేయి ఎవరిది అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆర్‌డీ రాజశేఖర్ కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.
Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..
Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్
Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..
Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు