AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Single OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు సూపర్ హిట్.. సింగిల్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

తెలుగు సినిమాల్లో ఇప్పుడిప్పుడే సక్సెస్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. సరికొత్త జానర్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవలే సింగిల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు.

Single OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు సూపర్ హిట్.. సింగిల్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
Single Movie
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2025 | 12:44 PM

Share

తెలుగు సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ హీరో.. ఈ ఏడాది సింగిల్ మూవీతో మరో హిట్టు అందుకున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మే 9న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ అదిరిపోయాయి. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాడ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ మూవీ ఆకస్మాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 6 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ ఈ సినిమా అందుబాటులోకి రావడం విశేషం. ఇన్నాళ్లు థియేటర్లలో ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

కథ విషయానికి వస్తే.. విజయ్ (శ్రీవిష్ణు) ఎస్డీఎఫ్ బ్యాంక్ లో ఇన్స్యూరెన్స్ విభాగంలో పనిచేస్తుంటాడు. అదే బ్యాంక్ లో పనిచేసే తన మిత్రుడు అరవింద్ (వెన్నెల కిషోర్)ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాలు ఉంటాడు. ఈ విషయంలో అరవింద్ కు సాయం చేస్తుండగా మెట్రోలో పూర్వ (కేతిక శర్మ)ను చూసి మనసు పారేసుకుంటాడు. ఓ కారు షోరూంలో ఆమె పనిచేస్తుందని తెలుసుకొని ఎలాగైనా తనను ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా డ్యాన్సర్ హరిణి (ఇవానా) తన జీవితంలో రావడంతో అతడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది.. ? చివరకు విజయ్ ప్రియురాలిగా ఎవరు అనేది సినిమా.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..