AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ప్రియుడితో కలిసి భర్త మర్డర్‏కు ప్లాన్.. ఊహించని మలుపులు.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ..

ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కంటుంది ఒక మహిళ. దీంతో తన ప్రియుడితో కలిసి కొత్త పథకాన్ని రచిస్తుంది. తన ప్రేమికుడితో కలిసి భర్తను చంపి వితంతువుగా మారేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ ఆ తర్వాత జరిగే ఊహించని మలుపులు ప్రేక్షకులకు అనుక్షణం భయాన్ని కలిగిస్తాయి. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

OTT Movie: ప్రియుడితో కలిసి భర్త మర్డర్‏కు ప్లాన్.. ఊహించని మలుపులు.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ..
A Widows Game Movie
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2025 | 7:52 AM

Share

ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త జానర్ చిత్రాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది. తన భర్తను చంపేందుకు ఓ ఇల్లాలు చేసే ప్లాన్.. తిరిగి ఆమె ఎలాంటి చిక్కుల్లో పడింది అనేది సినిమా. తన ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసి వితంతువుగా మారే డ్రామాను క్రియేట్ చేస్తుంది. ఈ ప్రమాదకరమైన సినిమా చూస్తూ మీరు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సస్పెన్స్, థ్రిల్లర్ క్రైమ్ సినిమా గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓటీటీలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా “ఎ విడోస్ గేమ్”. ఈ గేమ్‌లో మరణం, ఒక ప్రేమ వ్యవహారం, ఒక షాకింగ్ నిజం ఉంటాయి. ఇక క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు.

ఇది స్పానిష్ సినిమా. ఎ విడోస్ గేమ్’ పేరుతో ఎంత సింపుల్‌గా ఉందో కథ కూడా అంతే సాధారణంగా సాగుతుంది. తన భర్తను హత్య చేసి వితంతువుగా మారిన మహిళ.. పోలీసుల నుంచి తన తన పొరుగువారి వరకు అందరినీ చిక్కుల్లో పడేసేలా తన భర్త మరణాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ 15.4 మిలియన్ల వ్యూస్ పొందింది. ప్రస్తుతం 24 దేశాల్లో ట్రెండింగ్ అవుతుంది. కార్లోస్ సెడెస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆయన ఇప్పటికే ది అసుంటా కేస్ వంటి ఉత్కంఠభరితంగా సాగే చిత్రాలను రూపొందించారు.

ప్రేమ, మోసం, అబద్దాల సామ్రాజ్యాలు కలగలిసిన హత్య ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కాబట్టి మీరు ఈ థ్రిల్లింగ్ , సస్పెన్స్ థ్రిల్లర్‌ని చూడకపోతే, OTTలో మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..