Cinema : 60 కోట్లతో తీసిన సినిమా.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపుతోంది..
2 గంటల 23 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఇప్పుడు డిజిటల్ విడుదల తర్వాత దూసుకుపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఈ మూవీ ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా. ? ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.

2025లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. కానీ కొన్ని పరాజయం పాలయ్యాయి. కానీ థియేటర్లలో ప్లాప్ అయిన ఓ సినిమా మాత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనాలు సృష్టిస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చిన తర్వాత అది టాప్ ట్రెండింగ్ జాబితాలో కూడా చోటు సంపాదించింది. ఆ సినిమా పేరు “ధడక్ 2.” మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. కుల ఆధారిత వివక్షకు సంబంధించిన సున్నితమైన సామాజిక సమస్యను పరిష్కరిస్తుంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. జాకీర్ హుస్సేన్, సౌరభ్ సచ్‌దేవా, దీక్షా జోషి, నితిన్ శర్మ కూడా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఈ సినిమా లా కాలేజీలో చదువుతున్న నీలేష్, విధిల కలయికతో ప్రారంభమవుతుంది. క్రమంగా వారి మధ్య ప్రేమ వికసిస్తుంది. అయితే కుల భేదాలు, సామాజిక స్టీరియోటైప్‌లు, విధి కుటుంబ అభిప్రాయాలు వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. కొంతకాలం తర్వాత వీరి ప్రేమలో మరిన్ని కష్టాలు వస్తాయి. ఇది సామాజిక స్టీరియోటైప్‌లను ఎదుర్కొనే, ఆలోచించేలా చేసే భావోద్వేగ ప్రేమకథ. అయితే విడుదలైన తర్వాత, ధడక్ 2 బాక్సాఫీస్ వద్ద బాగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేకపోయింది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
కానీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇప్పటికే ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం, ధడక్ 2 నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. “కాంతారా” మొదటి స్థానంలో, “సన్ ఆఫ్ సర్దార్ 2” రెండవ స్థానంలో, “నరసింహ మహావతార్” మూడవ స్థానంలో ఉన్నాయి. ఐదవ స్థానంలో రొమాంటిక్ డ్రామా “సైయారా” ఉంది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‌లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..








