AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishkindhapuri OTT: ఓటీటీలోకి అనుపమ హారర్ థ్రిల్లర్.. కిష్కంధపురి స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి’. హారర్ థ్రిల్లర్ మూవీకి డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబ‌ర్ 12న వ‌చ్చి సూప‌ర్ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

Kishkindhapuri OTT: ఓటీటీలోకి అనుపమ హారర్ థ్రిల్లర్.. కిష్కంధపురి స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..
Kishkindhapuri Movie Review
Rajitha Chanti
|

Updated on: Oct 10, 2025 | 1:10 PM

Share

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం ఈ హారర్-థ్రిల్లర్ థియేటర్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందరికీ థియేటర్లో ఇది సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లోకి రాబోతోంది. అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుండి ‘కిష్కింధపురి’ని స్ట్రీమింగ్‌కు కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఇక ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోకి అడుగు పెడుతోంది.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

ఇవి కూడా చదవండి

రేడియో స్టేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో వచ్చిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దమైంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. “నేను పోషించిన అత్యంత కఠినమైన పాత్రలలో ఇది ఒకటి. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు సెట్‌లో మన ముందు ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు. కానీ మేం మాత్రం ఊహించుకుని అలా నటించాల్సి వస్తుంది. నటుడిగా, అది నన్ను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకు వచ్చినట్టు అయింది. సెట్‌లో నేను నిరంతరం భయం,అనిశ్చితి వాతావరణంలో జీవించాల్సి వచ్చింది. రేడియో స్టేషన్ వింతైన వాతావరణం నాతో పాటు ఇంకా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ..‘‘కిష్కింధపురి’లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రకరకాల ఎమోషన్స్‌ను పోషించే అవకాశం నాకు ఈ చిత్రంతో దక్కింది. ఇందులో నా పాత్ర ‘హారర్ హీరోయిన్’ స్టీరియోటైప్ పాత్ర కాదు. కొన్ని సార్లు భయపడుతుంది, ఇంకొన్ని సార్లు కృంగిపోతుంది.. మరి కొన్ని సార్లు తనని తాను ప్రశ్నించుకుంటుంది.. మళ్లీ వెంటనే రెట్టింపు శక్తితో పైకి లేస్తుంది.. నా పాత్రకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నాకు, ఆ వెంటాడే ప్రదేశాలలో షూటింగ్ అనేది ఒక వింతైన అనుభవం. మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మనల్ని మన పాత్రల్లోకి లోతుగా నెట్టివేస్తున్నట్లు అనిపించింది’ అని అన్నారు. ఉత్కంఠభరితమైన ప్రదర్శనలు, హృదయ విదారక దృశ్యాలు, ప్రేక్షకులను చివరి వరకు ఊహించని కథాంశంతో ‘కిష్కింధపురి’ హర్రర్ ప్రియులకు తప్పక నచ్చుతుంది.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..