Ram Gopal Varma: మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌‌‌‌తో రానున్న వర్మ.. ఈ సారి ‘రకరకాల భార్యలు’అంటూ..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 25, 2021 | 8:38 PM

వివాదాల వర్మకు ఏం చేసిన అది సంచలనమే.. చిన్న అంశం దొరికినా వర్మకు అది పెద్ద సినిమా స్టోరీ అవుతుంది. ఇప్పటికే అనేక వివాదాస్పద సినిమాలు, సిరీస్ లు తీసిన వర్మ తాజాగా...

Ram Gopal Varma: మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌‌‌‌తో రానున్న వర్మ.. ఈ సారి 'రకరకాల భార్యలు'అంటూ..
Rgv

Ram Gopal Varma : వివాదాల వర్మ ఏం చేసిన అది సంచలనమే.. చిన్న అంశం దొరికినా వర్మకు అది పెద్ద సినిమా స్టోరీ అవుతుంది. ఇప్పటికే అనేక వివాదాస్పద సినిమాలు, సిరీస్‌‌‌లు తీసిన వర్మ.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి కొత్త కంటెంట్‌‌‌‌ను ఇవ్వబోయితున్నాడు. తనకే సాధ్యమయే స్టైల్‌‌‌లో వివాదాలుకు అతి దగ్గర.. మహిళల మనోభావాలు దెబ్బతినేలా.. ఓ సిరీస్‌‌‌‌ను మన ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ను ట్విట్టర్ వేదికగా అనౌన్స్ కూడా చేశారు. రకరకాల భార్యలు అంటూ వెబ్ సిరీస్‌‌‌ను తీసుకురానున్నారు. అలాగే రకరకాల భర్తలు అంటూ దీనికి కొనసాగిపును కూడా సిద్ధంచేస్తున్నారు. దాంతో మరోసారి వర్మ హాట్ టాపిక్ గా మారారు.

ఏడుపుగొట్టు, దెబ్బలాడే రకం, ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి, ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు, గొప్పలు చెప్పుకునే భార్య ఇలా ఎనిమిది తరకాల భార్యలు ఉంటారని అని చెప్పుకొచ్చారు వర్మ. ఇక ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకం భార్య గురించి చెప్తామని, మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశమన్నారు ఆర్జీవీ.  ఇటీవల 30 వెడ్స్ 21 సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య తో ఈ వెబ్త్వ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు వర్మ.  ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. దానికి సంబంధించిన ప్రమోషనల్ (మాటల) వీడియోను యూట్యూబ్ లో వదిలారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Narappa : ప్రత్యర్ధుల పైకి ఎగబడుతూ కత్తి దూస్తూన్న నారప్ప.. మేకింగ్ వీడియో

Nidhhi Agerwal: వాన పాటలు చూడటాన్నికి బాగుంటాయి..కానీ చేయడానికే చిరాకు అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

‘చోర్ బజార్’లో గన్ పట్టుకొని నిలుచున్న ఆకాష్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu