AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mr Bachchan OTT: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నల గడ్డ ఓ కీలక పాత్రలో మెరిశాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ఇండిపెండెన్సెడే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మిస్టర్ బచ్చన్.

Mr Bachchan OTT: రవితేజ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Mr Bachchan Movie
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 7:32 PM

Share

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నల గడ్డ ఓ కీలక పాత్రలో మెరిశాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ఇండిపెండెన్సెడే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మిస్టర్ బచ్చన్. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలమైంది. మొదటి షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ కావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు మిస్టర్ బచ్చన్. అయితే రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, భాగ్యశ్రీ అందాలు, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మిస్టర్ బచ్చన్ సినిమాను ఆదుకున్నాయి. ఓ మోస్తరు కలెక్షన్లను కూడా తెచ్చాయి. థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న మిస్టర్ బచ్చన్ త్వరలోనే ఓటీటీలోకి వస్తున్నట్లు సమాచారం .ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజుకు ముందే దీనికి సంబంధంచి డీల్ జరిగింది. రవితేజ క్రేజ్, హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని దాదాపు ఇర‌వై ఐదు కోట్ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ ద‌క్షిణాది భాష‌ల డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ నేపథ్యంలో థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని మిస్టర్ మిస్టర్ బచ్చన్ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమా ను ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సెప్టెంబర్ మొదటి వారంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించారు. మిక్కీజే మేయర్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు విలన్ గా నటించారు. అలాగే కమెడియన్ సత్య‌, ప్ర‌వీణ్, ఝూన్సీ, స‌చిన్ ఖేడ్క‌ర్, చమ్మక్ చంద్ర తదితరులు కీల‌క పాత్ర‌ల్లో మెరిశారు.

ఇవి కూడా చదవండి

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..