AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Committee Kurrollu OTT: ఓటీటీలోకి నిహారిక సూపర్ హిట్ సినిమా.. కమిటీ కుర్రోళ్లు స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్లు. మొత్తం 11 మంది కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా నటించడం విశేషం. అలాగే నలుగురు కొత్త అమ్మాయిలు కొత్తగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. య‌దు వంశీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ సినిమా ఆగస్టు 09న గ్రాండ్ గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Committee Kurrollu OTT: ఓటీటీలోకి నిహారిక సూపర్ హిట్ సినిమా.. కమిటీ కుర్రోళ్లు స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Committee Kurrollu
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 3:08 PM

Share

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్లు. మొత్తం 11 మంది కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా నటించడం విశేషం. అలాగే నలుగురు కొత్త అమ్మాయిలు కొత్తగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. య‌దు వంశీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ సినిమా ఆగస్టు 09న గ్రాండ్ గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరిలో జరిగే ఓ జాతర, ఎన్నికలను నేపథ్యంగా తీసుకుని కమిటీ కుర్రోళ్లు సినిమాను తెరకెక్కించారు. 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లెల వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించడంతో కమిటీ కుర్రోళ్లు థియేటర్లకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.15.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ వంటి బడా హీరోల చిత్రాలు రిలీజైనప్పటికీ కమిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో ఇంకా జోరు చూపిస్తోంది. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా నిహారిక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలో కమిటీ కుర్రోళ్లు సినిమా ఆహాలోకి అడుగు పెట్టవచ్చని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనుందట.

ఇవి కూడా చదవండి

కాగా కమిటీ కుర్రోళ్ళు సినిమాను తీసుకునేందుకు ముందుగా ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ముందుకు రాలేదట. ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‍లో నిర్మాత నిహారిక కొణిదెల స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయితే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం, భారీగా కలెక్షన్లు రావడంతో ఓటీటీ హక్కులకు డిమాండ్ డబుల్ అయిందని నిహారిక చెప్పుకొచ్చింది. ఈ మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివకుమార్, తేజస్వి రావ్, విశిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని తదితరులు ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

కాకినాడలో కమిటీ కుర్రోళ్లు సక్సెస్ టూర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!