Unstoppable S4: ‘వారికి అన్యాయం జరిగితే నాకు కోపం వస్తుంది’.. బాలయ్య, బన్నీల అన్ స్టాపబుల్ ప్రోమో చూశారా?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో.. అన్ స్టాపబుల్. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ టాక్ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ అన్ స్టాపబుల్ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా విచ్చేశాడు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజన్ లో మొదటి మూడు ఎపిసోడ్స్ ఇప్పుటికే స్ట్రీమింగ్ కాగా ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన రెస్పాన్స్ వచ్చింది. తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్యలు అతిథులుగా వచ్చారు. ఇక నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య, బన్నీల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సినిమా విశేషాలతోపాటు జాతీయ అవార్డు అందుకోవడం గురించి మాట్లాడుకున్నారు. తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని.. ఎలాగైనా సాధించాలనుకున్నానని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ తరువాత బాలకృష్ణ చిరంజీవి, మహేశ్‌బాబు లతో సహా పలువురు స్టార్స్ ఫోటోలను చూపిస్తూ.. వారిని చూడగానే ఏమి అనిపిస్తుందని బాలయ్య అడిగారు. దీంతో చిరంజీవి, మహేశ్ బాబులతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్.
ఇక అల్లు అర్జున్ తో బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అనగా ఎలా అని బన్నీ అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. ఆ తర్వాత ‘ మీరు గీత ఇవ్వండి, మేము కురుక్షేత్రం చేస్తాం’ అరి అల్లు అర్జున్ అన్నారు. ఆ తరువాత మీరు నాకు పార్టీ ఇవ్వలేదని బాలయ్య అడగ్గా.. ఈసారి కచ్చితంగా ఇస్తాననన్నాడు బన్ని. ఇక అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే తనకు బాగా కోపం వస్తుందన్నాడు అల్లు అల్లు అర్జున్. ఇలా ఎన్నో విషయాల గురించి బాలయ్య, బన్నీలు ముచ్చట్లు చెప్పుకున్నారు.
చిరంజీవి, మహేష్ ల గురించి బన్నీ ఏమన్నాడంటే?
Unstoppable stage meeda #Akhanda #Pushpa 🥵🥵
Episode lo entertainment taggede le 🔥🔥 Fire lanti episode ee Nov 15 ki!#Unstoppable #iconstar #AlluArjun𓃵 #AlluArjunOnAha #stylishstaralluarjun #UnstoppableS4 #UnstoppableWithNBK #balayyapanduga #NandamuriBalakrishna #JaiBalayya… pic.twitter.com/8dhKX2xHua
— ahavideoin (@ahavideoIN) November 10, 2024
కాగా ఈ ఫైర్ ఎపిసోడ్ నవంబర్ 15న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
బాలయ్య అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో.. వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.