The Family Man 3 OTT: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’లో మరో స్టార్ నటుడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్రేక్షకులను అమితంగా అలరించిన వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కూడా ఒకటి. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సీజన్ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-1,2 సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సమంత నటించిన సీజన్ 2 కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సహజంగానే సినీ అభిమానులు మూడో సీజన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మూడవ సీజన్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ప్రశ్నలు వేస్తున్నారు. చివరకు వీటికి సమాధానం దొరికింది. ఈ వెబ్ సిరీస్‌లోని ప్రధాన నటుడు మనోజ్ బాజ్‌పేయి ఒక కార్యక్రమంలో ఈ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఈ సిరీస్ కోసం మనం మరికొన్ని నెలలు వేచి ఉండాలన్న ఆయన విడుదల తేదీని కూడా వెల్లడించారు. ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’లో సమంత విలన్ పాత్ర పోషించింది. ఈ సీజన్ పూర్తి కాకముందే మూడవ సీజన్ లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే, మూడవ సీజన్‌లో, శత్రువులు బాంబుల ద్వారా కాదు, వైరస్‌ల ద్వారా దాడి చేస్తారని చూపించారు. కాగ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్‌లో స్ట్రీమింగ్ కు రానుంది.
కాగా ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లోకి మరో ప్రముఖ నటుడు చేరాడు. అతను మరెవరో కాదు పాతాళ్ లోక్ ఫేమ్ జైదీప్ అహ్లావత్. ‘రెండు సంవత్సరాల క్రితం ప్రదీప్ ఈ సిరీస్ లోకి వచ్చాడు. పాతాళ్ లోక్ సీజన్ 2 లో అతను అద్భుతంగా నటించాడు. ఇప్పుడు మా అదృష్టం కొద్దీ అతను ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లోకి వచ్చాడు. ఈ సీజన్ మరింత అందంగా మారింది’ అని మనోజ్ అన్నారు.
మొదటి రెండు సీజన్లను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ద్వయమే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ కి దర్శకత్వం వహిస్తున్నారు. వీరు గతంలో ‘ఫర్జీ’. ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. ఈ కారణంగా, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చిత్రీకరించడం సాధ్యం కాలేదు. ఇప్పుడు, సమయం తీసుకుని, అతను ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ షూటింగ్ పూర్తి చేశారు. ఈ సిరీస్ లో ప్రియమణి కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది.
నవంబర్ లో స్ట్రీమింగ్ కు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.