AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha: మూవీ లవర్స్‌కి ‘ఆహా’ సర్‌ప్రైజ్.. వీకెండ్ కానుక‌గా రెండు ఫీచర్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్

ఫిలిమ్ లవర్స్‌కి ఎప్పటికప్పుడు సర్‌ప్రైజెస్‌ ఇచ్చే ఆహా యాప్‌.. ఈ వీకెండ్‌లో మరో రెండు ఫీచర్ ఫిలిమ్స్‌ని తీసుకొచ్చింది. భిన్నమైన స్టోరీలైన్స్‌లో డిఫరెంట్ ఫీల్‌నిచ్చే....

Aha: మూవీ లవర్స్‌కి 'ఆహా' సర్‌ప్రైజ్.. వీకెండ్ కానుక‌గా రెండు ఫీచర్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్
Aha Ott
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2021 | 4:29 PM

Share

ఫిలిమ్ లవర్స్‌కి ఎప్పటికప్పుడు సర్‌ప్రైజెస్‌ ఇచ్చే ఆహా యాప్‌.. ఈ వీకెండ్‌లో మరో రెండు ఫీచర్ ఫిలిమ్స్‌ని తీసుకొచ్చింది. భిన్నమైన స్టోరీలైన్స్‌లో డిఫరెంట్ ఫీల్‌నిచ్చే ఆ రెండు మూవీస్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండి. అచ్చతెలుగు ‘ఆహా’ యాప్‌లో రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వెట్రి, కరుణాకరణ్, రోహిణి నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జీవి.. ఈనెల 25 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. వీజే గోపీనాధ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. బిగ్ స్క్రీన్స్‌పై తమిళ్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ‘ఆహా’ లైబ్రరీలో యాడ్ అయిన మరో ఇంట్రస్టింగ్ మూవీ LKG. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన క్లవర్ పొలిటికల్ సెటైర్‌ ఇది. ఆర్జే బాలాజీతో పాటు ప్రియా ఆనంద్ లీడ్‌రోల్‌లో నటించారు.  ఇది కూడా నేటి నుంచే ఆహాలో అందుబాటులోకి వ‌చ్చింది. ఇన్నాళ్లూ బ్యాక్‌2బ్యాక్‌ మలబారు ఫ్లేవర్స్‌ని ఎంజాయ్ చేసిన డిజిటల్ ఆడియన్స్‌కి… ఈ వీకెండ్‌లో ఒకేసారి రెండు తమిళ్ థ్రిల్లర్స్‌ని అందుబాటులోకి తెచ్చింది ‘ఆహా’ యాప్.

Aha OTT: జూన్ 25న వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్స్‌గా ‘ఎల్‌.కె.జి’, ‘జీవి’ చిత్రాల‌ను అందిస్తున్న ‘ఆహా’

‘ఎల్‌.కె.జి’, ‘జీవి’ చిత్రాలు వేర్వేరు జోన‌ర్స్‌కు చెందిన‌వి. సినీ వినోదం కోసం త‌ప‌న ప‌డే ప్రేక్ష‌కులను సంతృప్తి ప‌రిచే ప‌క్కా పాప్‌కార్న్ చిత్రాలివి. అంతే కాదండోయ్ ఆహాలో అద్భుతైన షోస్ ఎన్నో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ‘క్రాక్‌, నాంది, జాంబిరెడ్డి, లెవ‌న్త్ అవ‌ర్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా, కాలా’ ఈ వ‌రుస‌లో కొన్ని. ప్రేక్ష‌కుల వారాంతాల‌ను మ‌రింత స‌జీవంగా, మెరుగ్గా చేయ‌డానికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’.

ఇటీవ‌ల ప్రియ‌ద‌ర్శి న‌టించిన‌ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ సిరిస్ కూడా తొలి తెలుగు ఓటీటీ.. ‘ఆహా’ వేదిక‌గా విడులై.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటుంది. విభిన్న కథాంశంతో తెర‌కెక్కిన ఈ సిరిస్‌కు మూవీ ల‌వ‌ర్స్ మంచి రివ్యూస్ ఇస్తున్నారు.

Also Read: ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్న డార్లింగ్.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి

బిహార్ టెట్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన న‌టి అనుప‌మ‌.. బిహార్‌లో ఎందుకు ఎగ్జామ్ రాసింద‌నేగా..?

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..