Tamanna: ట్రెండ్‌కు తగ్గట్లు మారుతోన్న మిల్కీ బ్యూటీ.. ముచ్చటగా మూడో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..?
Tamanna Web Series: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. థియేటర్లు మూతపడడం, బడా నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడంతో స్టార్ యాక్టర్స్ సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మారుతోన్న...
Tamanna Web Series: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. థియేటర్లు మూతపడడం, బడా నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడంతో స్టార్ యాక్టర్స్ సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మారుతోన్న ఈ కొత్త ట్రెండ్‌ను తూచా తప్పకుండా ఫాలో అవుతోంది అందాల తార తమన్నా.. తెలుగు నటీమణుల్లో వెబ్ సిరీస్‌లలో ఎక్కువ నటిస్తోన్న హీరోయిన్‌గా తమన్నా అరుదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే లెవన్త్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్‌సిరీస్‌లలో నటించిన సమంత నటిగా మరో మెట్టు పైకెక్కింది. ఈ రెండు వెబ్ సిరీస్‌ల కథ తమన్నా చుట్టే తిరిగిన విషయం తెలిసిందే. ఇలా వెబ్ సిరీస్‌ల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటోందీ అందాల తార.
ఇదిలా ఉంటే తమన్నా తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు తమన్నా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుందని తెలుస్తోంది. 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లో రానుంది.
Also Read: Aha: మూవీ లవర్స్‌కి ‘ఆహా’ సర్‌ప్రైజ్.. వీకెండ్ కానుకగా రెండు ఫీచర్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్
Prabhas: ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్న డార్లింగ్.. ఎందుకో తెలుసుకుందాం పదండి