Prabhas: ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్న డార్లింగ్.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి

డార్లింగ్ ప్రభాస్ ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్నారు. మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, రొబోటిక్స్ ఇలా చాలా డిఫరెంట్‌ వింగ్స్‌కు సంబంధించిన టాలెంటెండ్ అండ్ ఎక్స్‌పీరియన్సెడ్‌

Prabhas: ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్న డార్లింగ్.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి
Prabhas
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 25, 2021 | 4:03 PM

డార్లింగ్ ప్రభాస్ ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్నారు. మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, రొబోటిక్స్ ఇలా చాలా డిఫరెంట్‌ వింగ్స్‌కు సంబంధించిన టాలెంటెండ్ అండ్ ఎక్స్‌పీరియన్సెడ్‌ ఇంజనీర్లు కావాంటున్నారు డార్లింగ్. అదేంటి.. ఇంజనీర్లతో ప్రభాస్‌కు పనేంటి..? ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా..? అందుకే ఈ హైరింగా..? ఇలా రకరకాల థాట్స్ వస్తున్నాయా.. ఆగండాగండి…? మేము క్లారిటీ ఇస్తాం. ఆల్రెడీ రాధేశ్యామ్‌ కంక్లూజన్‌కు వచ్చేసింది. ఆదిపురుష్, సలార్‌.. సెట్స్ మీద ఉన్నాయి… ఇక నాగ్ అశ్విన్‌తో చేస్తున్న మోస్ట్ ప్రస్టీజియస్‌… మూవీ కూడా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన నాగీ… ఇప్పుడు సెట్స్ అండ్ ప్రాపర్టీస్ మీద దృష్టి పెట్టారు. 90స్‌లో సూపర్ హిట్ అయిన ఆదిత్య 369 తరహా టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అందుకే అలాంటి వాతావరణాన్ని మరింత పర్ఫెక్ట్‌గా చూపించేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్‌ నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా కోసం సెట్ ప్రాపర్టీస్‌ను ఇంజనీర్స్‌తో డిజైన్ చేయిస్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఊహించి… ఆ కాలంలో ఉండే డివైజ్‌లను డిజైన్ చేసే ఇంజనీర్లకు వెల్‌కం చెప్పింది ప్రొడక్షన్‌ హౌస్‌ వైజయంతీ మూవీస్‌. నాగీ టీమ్‌తో పాటు ఆదిత్య 369 డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ కూడా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. సీనియర్ల అనుభవం.. యంగ్ జనరేషన్ న్యూ థాట్స్‌తో ప్రభాస్ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందించాలన్నది ప్లాన్‌. మరి ఈ సినిమాతో డార్లింగ్ ఎలాంటి రికార్డ్స్‌ సృష్టిస్తారో చూడాలి.

Also Read: భర్త ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగి వేసారిపోయింది.. రాత్రి అత‌డు నిద్రిస్తున్న స‌మ‌యంలో మర్మాంగాన్ని కోసి

 ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాల‌కు అప్లై చేసుకున్నారా.? ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ.