భర్త ప్రవర్తనతో విసిగి వేసారిపోయింది.. రాత్రి అతడు నిద్రిస్తున్న సమయంలో మర్మాంగాన్ని కోసి…
ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలో సంచలన ఘటన జరిగింది. మూడో పెళ్లికి సిద్ధమైన భర్త మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. దీంతో అతను స్పాట్‌లోనే చనిపోయాడు.
ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలో సంచలన ఘటన జరిగింది. మూడో పెళ్లికి సిద్ధమైన భర్త మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. దీంతో అతను స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడు భౌరా ఖుర్ద్ గ్రామ మసీదులో మత గురువుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తన భర్త మూడో వివాహం చేసుకునే ఉద్దేశంతో తనతో రోజూ గొడవ పడటం, వేధించడం చేస్తున్నాడని… అతని చేష్టలతో విసిగిపోయి చంపేశానని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భౌరా కాలన్ పోలీసులు డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహిళను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం.. మృతుడి మర్మాంగానికి తీవ్ర గాయం కావడంతోనే మరణించాడని.. శరీరంలో తీవ్రమైన గాయాలు సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత అనుమానాస్పద మృతిగా పరిగణించిన పోలీసులు.. మృతుని భార్యను తమదైన శైలిలో విచారించగా.. ఆమె నేరాన్ని ఒప్పుకున్నారు.
“నా భర్తకు నేను రెండో భార్యను. మాకు ఐదుగురు కుమార్తెలు. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్దమయ్యాడు. నేను అంగీకరించకపోవడంతో రోజూ కొట్టేవాడు. నా పెద్ద కుమార్తెనే పెళ్లి చేసుకోవాలని చూశాడు. అందుకే చంపేశాను ” అని పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది.
తరచూ గొడవలు, తగాదాలతో విసిగిపోయిన ఆమె.. బుధవారం రాత్రి సమయంలో నిద్రపోతున్న తన భర్త మర్మాంగం భాగంలో కత్తితో పొడిచి దారుణంగా మర్డర్ చేసినట్లు భౌరా కాలన్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి జితేంద్ర సింగ్ తెవాటియా వెల్లడించారు.
Also Read: KTR: ‘శాంతి కోసం ఎంత శ్రమిస్తే.. యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తాము’..