15 రోజుల్లో పెళ్లి.. ఇంటి నుంచి యువతి పరార్.. ఊహించని రీతిలో మలుపు తిరిగిన కథ..

పెద్దలు కుదిర్చిన పెళ్లి నచ్చక కొంతమంది యువతీయువకులు ఇంట్లో నుంచి పారిపోయే సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా..

15 రోజుల్లో పెళ్లి.. ఇంటి నుంచి యువతి పరార్.. ఊహించని రీతిలో మలుపు తిరిగిన కథ..
Crime
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 25, 2021 | 4:55 PM

పెద్దలు కుదిర్చిన పెళ్లి నచ్చక కొంతమంది యువతీయువకులు ఇంట్లో నుంచి పారిపోయే సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పెళ్లికి 15 రోజులు ఉండగా.. ఓ యువతి భారీగా డబ్బు, విలువైన ఆభరణాలతో ఇంటి నుంచి పారిపోయింది. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల సమాచారం మేరకు.. హంపీపూర్‌కు చెందిన ఓ యువతికి జూలై నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేశారు. అయితే అనూహ్యంగా జూన్ 19వ తేదీన సదరు యువతి పెళ్లి కోసం దాచిన రూ. 50 వేలు నగదు, బంగారు ఆభరణాలతో ఇంటి నుంచి పరారైంది. ఆమె వెళ్తూ.. వెళ్తూ ‘నేను ఇల్లు వదిలి వెళ్తున్నా’ అని చిన్న పేపర్ మీద రాసి వెళ్ళిపోయింది. అనంతరం దీనిపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదేదో ప్రేమ వ్యవహారం అని పోలీసులు అనుకోగా.. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ బయటపడింది.

తన కూతురు ప్రముఖ సింగర్ గురు రందావాకు పెద్ద ఫ్యాన్ అని.. అతడి పోస్టులను తరచూ రీ-ట్వీట్ చేస్తూ, లైక్ కొడుతుందని సదరు యువతి తల్లిదండ్రులు తెలిపారు. కొంతకాలం క్రితం ఆమెకు రందావా ఫ్రెండ్‌ని అంటూ ఓ అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పుకొచ్చారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడని.. అతడి దగ్గరికే తమ కూతురు పారిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Also Read:

ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!

 ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!