Security fires Bank Customer: దారుణం..మాస్క్ వేసుకోలేదని బ్యాంక్ కస్టమర్ ని కాల్చిన సెక్యూరిటీ గార్డు
Security fires Bank Customer: దారుణం చోటుచేసుకుంది. మాస్క్ విషయమై జరిగిన చిన్న గొడవ ఒకరిపై కాల్పులకు కారణం అయింది. తీవ్రగాయాల పాలైన బాధితుడు ఆసుపత్రిలో ఉన్నాడు.
Security fires Bank Customer: దారుణం చోటుచేసుకుంది. మాస్క్ విషయమై జరిగిన చిన్న గొడవ ఒకరిపై కాల్పులకు కారణం అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటు చేసుకుంది. కారులో మాస్క్ మర్చిపోయి బ్యాంకుకు వచ్చిన ఓ రైల్వే ఉద్యోగిని అక్కడి గార్డు అడ్డుకున్నాడు. దీంతో అతను వెనుతిరిగి వెళ్లి మాస్క్ పెట్టుకుని వచ్చారు. ఈసారి భోజనం సమయం లోపలి వెళ్లనిచ్చేది లేదని మళ్ళీ అడ్డుకున్నాడు గార్డు. దీంతో ఆ కస్టమర్ గార్డుతో వాగ్వివాదానికి దిగారు. వాదన మధ్యలో కోపం వచ్చిన గార్డు అతని కాలిపై తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ కస్టమర్ అక్కడే కుప్పకూలిపోయాడు. బాధితుడి భార్య ప్రియాంక ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ బరేలీ కి చెందిన రాజేష్ రైల్వే ఉద్యోగి. ఇక్కడి స్టేషన్ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తన పాస్ బుక్ ఎంట్రీలు వేయిన్చుకోవడానికి శుక్రవారం బ్యాంక్ కు చేరుకున్నారు. కారులో వచ్చిన ఈయన కారు దిగి బ్యాంక్ కు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోయారు. బ్యాంక్ గేటు ముందు సెక్యూరిటీ గార్డు కేశవ్ ప్రసాద్ మిశ్రా (45) మాస్క్ లేకుండా లోపలి రానివ్వరని చెప్పాడు. దీంతో రాజేష్ వెనుతిరిగి కారు వద్దకు వెళ్లి మాస్క్ పెట్టుకుని మళ్ళీ వచ్చారు. అయితే, ఈసారి కేశవ్ ప్రసాద్ భోజనాల టైం అయిందనీ.. తరువాత రావాలనీ రాజేష్ ను ఆపివేశాడు. దీంతో రాజేష్ నాకు బ్యాక్నులో ఎక్కువ పనిలేదు. కేవలం పాస్ బుక్ ఎంట్రీ అని చెప్పారు. అయినా సరే గార్డ్ ప్రసాద్ వినలేదు. దీంతో రాజేష్ అతనితో వాదనకు దిగాడు. అయితే, ప్రసాద్ పరుషంగా మాట్లాడి రాజేష్ ను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పాడు. రాజేష్ వినలేదు. దీంతో కోపం పట్టలేని గార్డ్ కేశవ్ ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకీతో రాజేష్ ను కాల్చాడు. దీంతో రాజేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
రక్తపు మడుగులో కింద పడిపోయిన రాజేష్ ను రక్షించడానికి బ్యాంకు సిబ్బంది ఎవరూ ముందుకు రాలేదు. కనీసం అతని కోసం అంబులెన్స్ కూడా పిలిపించే ప్రయత్నం చేయలేదు. రక్తం కరిపోతున్న రాజేష్ ను అలానే వదిలివేశారు. రాజేష్ ఈ విషయాన్ని తన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి చెప్పారు. ఆమె రాజేష్ సహా ఉద్యోగులకు సమాచారం ఇచ్చి పరుగున బ్యాంక్ వద్దకు చేరుకుంది. ఈ లోపు రైల్వే ఉద్యోగులు కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలసి రాజేష్ ను ఆసుపత్రికి చేర్చారు. ఆసుపత్రిలో రాజేష్ కు చికిత్స జరుగుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కాలికి ఆపరేషన్ అవసరం అవుతుందని తెలిపారు. సంఘటన పై ఫిర్యాదు అందుకున్న కొట్వాలి పోలీసులు సెక్యూరిటీ గార్డు కేశవ్ ప్రశాద్ ను అదుపులోకి తీసుకున్నారు. గుండెల్లోకి కాల్చలేదు సంతోషించు..
రాజేష్ భార్యప్రియాంక కంగారుగా బ్యాంకుకు చేరుకొని, తన భర్త పరిస్థితికి నీరుకారిపోయారు. సెక్యూరిటీ గార్డును ఎందుకు ఇలా చేశావ్ అని నిలదీశారు. కలిలోనే కాల్చాను.. నిజానికి వాడి గుండెల్లో కాల్చాల్సింది అని కేశవ్ ప్రసాద్ సమాధానం ఇచ్చాడు.
భర్త ప్రవర్తనతో విసిగి వేసారిపోయింది.. రాత్రి అతడు నిద్రిస్తున్న సమయంలో మర్మాంగాన్ని కోసి…