మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ… నలుగురు మిలీషియా సభ్యులు అరెస్టు
మావోయిస్టు మిలీషియా సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మన్యంలోని మావోయిస్టులకు ఓ వైపు కోవిడ్ ప్రాణాలను హరిస్తుంటే.. మరో వైపు పోలీసుల దాడులు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చర్ల మండలం పరిధిలోని బత్తినపల్లి-రామచంద్రాపురం గ్రామాల మధ్య పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు తారసపడటంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన వారి పూర్తి వివరాలను వెల్లడించారు. మరింత మంది నక్సల్స్ ఉన్నారన్న సమాచారం మేరకు అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నట్లు సమాచారం.
అరెస్ట్ చేయబడిన నిషేధిత మావోయిస్ట్ పార్టీ మిలీషియా సభ్యుల వివరాలు:
1). కుంజo దేవయ్య s/o జోగయ్య, r/o రామచంద్రాపురం గ్రామం, చర్ల మండలం, 2) కలుము సురేష్ s/o సోమ r/o పుట్టపాడు గ్రామం, సుక్మ జిల్లా , CG స్టేట్, 3) కొవ్వాసి చుక్క s/o పాండు, r/o మెట్టగుడ గ్రామం, బీజాపూర్ జిల్లా , CG స్టేట్, 4) పోడియం మాసయ్య s/o పోజ్జ, r/o ఇర్రపల్లి గ్రామం, బీజాపూర్ జిల్లా , CG స్టేట్