Florida Building Collapse: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన 12 అంతస్థుల భవనం.. 159 మంది ఆచూకీ గల్లంతు
Florida Building Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నివాస భవనం కుప్పకూలి దాదాపు 160 మంది ఆచూకీ లభించడం లేదు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని ఉత్తర మియామీ
Florida Building Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నివాస భవనం కుప్పకూలి దాదాపు 160 మంది ఆచూకీ లభించడం లేదు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని ఉత్తర మియామీ సమీపంలోని చోటుచేసుకుంది. ఉత్తర మియామీ సమీపంలో గురువారం 12 అంతస్తుల ఛాంపియన్ టవర్స్ కుప్పకూలింది. ఈ సంఘటనలో నలుగురు చనిపోగా, 159మంది ఆచూకీ లభ్యం కావటం లేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఛాంపియన్ టవర్స్ శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ చార్లెస్ బర్కెట్ వెల్లడించారు. గురువారం రాత్రి ఈ ఘోర సంఘటన జరిగింది. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజినీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఫ్లోరిడా అధికారులు తెలిపారు.
Also Read: