- Telugu News Photo Gallery Science photos Ct scan tests for ancient egypt mummy italy scientists trails to get the secrets behind the mummy
Egypt Mummy: పురాతన ఈజిప్ట్ మమ్మీలపై ఆధునిక సిటీ స్కాన్ పరీక్షలు..రహస్యాల ఛేదనకు ఇటలీ పరిశోధకుల ప్రయత్నాలు!
Egypt Mummy: బెర్గామో సివిక్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉన్న ఒక ఈజిప్షియన్ మమ్మీపై పరిశోధకులు సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మమ్మీల రహస్యాల కోసం చేస్తున్న పరిశోధనల్లో ఇలా సీటీ స్కాన్ చేయడం ఇదే మొదటిసారి.
Updated on: Jun 25, 2021 | 1:06 PM

పురాతన ఈజిప్ట్ మమ్మీలకు సిటీ స్కాన్ తీస్తున్నారు. ఒక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈజిప్ట్ మమ్మీల వెనుక ఉన్న రహాస్యాలను తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఆధునిక వైద్య టెక్నాలజీ కలిగిన ఇటలీ ఆస్పత్రిలో ఈజిప్ట్ మమ్మీలకు ఈ సిటీ స్కానింగ్ నిర్వహిస్తున్నారు.

పురాతన ఈజిప్టు మమ్మీల రహస్యాలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈజిప్టు మమ్మీలకు సంబంధించిన పరిశోధనల్లో కొన్ని అంశాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ స్కానింగ్ ద్వారా జరిపే విశ్లేషణలతో మూడువేల ఏళ్ళనాటి మానవుల జీవన విధానంపై మరిన్ని వివరాలు దొరుకుతాయని పరిశోధకులు నమ్ముతున్నారు.

ఈ పరిశోధనల కోసం పురాతన ఈజిప్టు పూజారి (Ankhekhonsu) మమ్మీని బెర్గామో సివిక్ ఆర్కియాలజికల్ మ్యూజియం నుంచి మిలన్ పోలిక్లినికో ఆస్పత్రికి నిపుణులు తరలించారు. ఇతను దాదాపు 3 వేల ఏళ్ల క్రితం జీవించేవాడు. ఇతనిని ఖననం చేసిన ఆచారాలకు సంబంధించి రహస్యాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ పరిశోధనలు సహాయ పడుతుందని భావిస్తున్నారు.

మమ్మీలు ఆచరణాత్మకంగా బయోలాజికల్ మ్యూజియం, టైమ్ క్యాప్సూల్ లాంటివి అని మమ్మీ ప్రాజెక్ట్ రీసెర్చ్ డైరెక్టర్ సబీనా మాల్గోరా అన్నారు. మమ్మీ పేరుపై సమాచారం క్రీస్తుపూర్వం 900, 800 మధ్య నాటి సార్కోఫాగస్ నుంచి వచ్చిందన్నారు. అలాగే మమ్మీలపై చెక్కిన అక్షరాల్లో అఖేఖోన్సు అని ఐదుసార్లు రాసి ఉంది.. అంటే ‘ఖోన్సు దేవుడు సజీవంగా ఉన్నాడు’ అని అర్ధంగా చెబుతారు.

గతంలోని క్యాన్సర్ లేదా ఆర్టిరియోస్క్లెరోసిస్ గురించి కూడా మమ్మీల ద్వారా అధ్యయనం చేయవచ్చునని అంటున్నారు. ఆధునిక పరిశోధనలకు ఇది చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మమ్మీలను సిటీ స్కానింగ్ ద్వారా పరీక్షించి వాటి రహాస్యాలను బయటపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.