ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. సైకియాట్రిక్ వార్డులో చేరిన మహిళ.. వెలుగులోకి సంచలన విషయాలు!

ఒకే కాన్పులో ప‌దిమంది సంతానానికి జ‌న్మనిచ్చి వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పాన‌ని క‌ట్టుక‌ధ అల్లిన ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ సంచలన వాస్త‌వాలు..

ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. సైకియాట్రిక్ వార్డులో చేరిన మహిళ.. వెలుగులోకి సంచలన విషయాలు!
South Africa Woman
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 25, 2021 | 1:51 PM

ఒకే కాన్పులో ప‌దిమంది సంతానానికి జ‌న్మనిచ్చి వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పాన‌ని క‌ట్టుక‌ధ అల్లిన ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ను సైకియాట్రిక్ వార్డులో చేర్చ‌గా సంచలన వాస్త‌వాలు వెలుగుచూశాయి. ఒకేసారి పదిమందికి జన్మనిచ్చానని ప్రకటించుకున్న గొసైమ్ థమ‌ర సిథోల్ అనే మహిళ వ్యవహారంలో అందరూ ఊహించినట్టే జరిగింది. అందరి అనుమానాలను పటాపంచల్‌ చేస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అధికారికంగా ఓ నివేదికను వెల్లడించింది. ఆమె, ఆమె భర్త చెప్పింది పచ్చి అబద్దమని చెబుతూ అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.. మానసిక చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది.

అసలు ఆ మహిళ ఈమధ్య కాలంలో గర్భమే దాల్చలేదనే విషయం వెలుగులోకి రావడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. ఈ మేరకు ఆమెను పరీక్షించిన వైద్యుల నివేదికను అధికారులు మీడియాకు రిలీజ్‌ చేశారు. అంతేకాకుండా సిథోల్ మానసిక ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మెంటల్‌ హెల్త్ యాక్ట్‌ కింద ఆమెను అదుపులోకి తీసుకుని ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తున్నారు. మరోవైపు ఆమె భర్త టెబెహో సోటెట్సిను పోలీసులు అరెస్ట్‌ చేశారు.అయితే, అలా అసత్య ప్ర‌చారం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలను ఆ మహిళ బయటపెట్టింది. న‌వ‌జాత శిశువుల‌ పేరుతో ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేక‌రించి..ఎక్కువగా మొత్తంలో డబ్బు సంపాదించాలని త‌న భ‌ర్త ప్లాన్ చేసిన‌ట్టు ఆమె చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే గతంలో కూడా ముగ్గురు పిల్లలు పుట్టారని సదరు మహిళ ప్రకటించుకుందని.. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని బంధువులు చెప్పారు. దీంతో ఆ మహిళ డెలివరీ కోసం ఏ ఆస్పత్రిలోనూ చేరలేదని నిర్ధారించుకున్న అధికారులు.. ఆపై ఆమె కట్టుకథను ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇక ఇదంతా ఫేక్‌ అని తేలడంతో.. మాలి దేశంలో మే నెలలో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన హలీమా సిస్సే రికార్డు పదిలంగా ఉందని చెప్పొచ్చు.

Also Read:

ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!

 ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!