Drowning: అనంతపురం జిల్లాలో విషాదం.. నీటికుంటలో పడి.. తల్లీకుమార్తె మృతి..
Mother Daughter Died: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి తల్లీ కుమార్తె మృతి చెందారు. కంబదూరు మండలం
Mother Daughter Died: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి తల్లీ కుమార్తె మృతి చెందారు. కంబదూరు మండలం అచ్చంపల్లిలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. స్థానికుల సాయంతో మరో కుమార్తె నీటిలో నుంచి బయటపడింది. తల్లీకుమార్తె ఒకేసారి మృతి చెందడంతో అచ్చంపల్లిలో విషాదం నెలకొంది.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి పలు వివరాలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: