KTR: ‘శాంతి కోసం ఎంత శ్రమిస్తే.. యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తాము’..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన....
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్‌లాక్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్తులో కరోనా పెరిగితే తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. హైదరాబాద్ వెంగళ్రావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘శాంతి కోసం ఎంత శ్రమిస్తే.. యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తాము’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఈ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా కరోనా థర్డ్ వేవ్‌ను, కరోనా ఇతర సమస్యలను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు.
కేటీఆర్ ట్వీట్
“The more you sweat in peace, the less you bleed in war”
Will be inaugurating a well equipped COVID control room today. This facility has been developed to assist citizens efficiently in the event of a third wave & other Corona related issues #TelanganaFightsCorona pic.twitter.com/6JP2dyx55z
— KTR (@KTRTRS) June 25, 2021
నేటి నుంచి ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ షురూ..
తెలంగాణ వ్యాప్తంగా జులై 1 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్ అవుతుండడంతో ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి అన్ని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది వైద్య శాఖ. వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ అధికారిని నియమించింది విద్యాశాఖ. ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో 100 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? : ప్రకాష్ రాజ్