సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ పేరుతో సంచలన లేఖ.. ఫేక్ లెటర్ అని తేల్చిన ఈటల వర్గం..!
Etela Letter to CM KCR: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరుతో లేఖ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అన్నా క్షమించు అంటూ కేసీఆర్ కు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుంది.

Etala to CM KCR Fake Letter Viral: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరుతో లేఖ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అన్నా క్షమించు అంటూ కేసీఆర్ కు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన మంత్రిగా ఉన్నప్పడు రాసిన లేఖగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొందరి వల్ల తప్పులు చేశా.. మీటింగులు పెట్టినా అంటూ లేఖ రాసారు ఆయన. అయితే అది ఫేక్ లెటర్ అంటూ ఈటల అనుచరులు ఖండిస్తున్నారు.. స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
20 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. ఎన్నో పదవులు, బాధ్యతలు నిర్వర్తించా. కానీ నాపై కొన్ని ఛానెళ్లలో వస్తున్న వార్తలు బాధించాయి. ఇటీవల కొన్ని తప్పులు చేశాను. కానీ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటా. ఈ ఒక్క సారికి క్షమించండి కేసీఆర్ గారు అంటూ ఈటల రాజేందర్ పేరుతో ఓ లెటర్ సోషల్ మీడియోలో తెగవైరల్ అవుతోంది.

Etela Letter To Cm Kcr Viral
ఇది చూసిన ఈటల వర్గం ఆశ్చర్యానికి గురైంది. ఈ లెటర్ ఫేక్ అని.. ఎవరూ నమ్మవద్దంటూ ఈటల వర్గం వివరణ ఇచ్చింది. ఈటల రాజేందర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ లేఖను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ లేఖ ఎవరు రాశారో.. ఎలా సర్క్యలేట్ అయిందో.. తమకు తెలీదంటూ తేల్చి చెప్పారు ఈటల వర్గీయులు. ఈ లెటర్ సర్క్యూలేట్ చేసినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుప్పాల రఘు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Etela Fake Letter Complaint
ఇటీవల ఈటల ఎపిసోడ్ పొలిటికల్ హీట్ పుట్టించింది. భూ ఆక్రమణలు ఆరోపణలు రావడం.. ఈటల కేబినెట్ నుంచి బర్తరఫ్ కావడం లాంటి పరిణామాలు ఇటీవల శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈటల కమలం గూటికి చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్టుగా జోరుగా రాజకీయం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో ఈటల పేరుతో ఫేక్ లెటర్ బయటకు రావడం చర్చకు దారి తీసింది. ఈ లెటర్ ఎలా వచ్చింది.. ఎవరు తయారు చేశారనే దానిపై ఈటల వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పోలీసులు కూడా ఓ కన్నేశారు.

Etela Fake Letter Complaint
