Minister KTR: గ్రేటర్‌లో చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం.. త్వరలో పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లుః కేటీఆర్
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో మైలురాయి ముందుకు పడింది. నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది.
KTR Inaugurates Construction and Demolition Waste Management Plant: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో మైలురాయి ముందుకు పడింది. నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌లోని ఫతుల్లాగూడలో 9 ఎకరాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ప్రతి రోజు 7 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. గతంలో ఉన్న 70 చెత్త కలెక్షన్, ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను 100కు పెంచుతున్నామని కేటీఆర్ వెల్లడించారు. వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీ నంబర్ 18001201159. ఇప్పటికే జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను నిర్మించామని గుర్తు చేశారు. జీడిమెట్ల ప్లాంట్‌లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం జరుగుతుందన్నారు.
భవన నిర్మాణ వ్యర్దాలను నాలాల్లో, మూసీ నదిలో వేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు హైద్రాబాద్ అతలాకుతలం అవుతోందన్న మంత్రి.. ఇవాళ ప్రారంభించిన ఫతుల్లాగూడ ప్లాంట్‌లో కూడా రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో మొత్తంగా 2 వేల టన్నుల వ్యర్థాల పునర్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. చెత్త ను తరలించేందుకు 90 ఆధునిక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. చెత్తా నుంచి ప్రస్తుతం 20 మెగా వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని.. త్వరలో మరో 28 మెగా వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలా అభివృద్ధి చేయడానికి రూ.850 కోట్లతో SNDP నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇక, వర్షా కాలంలో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడకుండా పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
MA&UD Minister @KTRTRS inaugurated the C&D Waste Recycling Plant at Fathullaguda in Hyderabad. MLA @D_SudheerReddy, MLCs Yegge Mallesham and Boggarapu Dayanand, Deputy Mayor @SrilathaMothe and other dignitaries were present. pic.twitter.com/c1hthMfHFn
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 25, 2021
Read Also…. AP ENC on Srisailam: తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ లేఖ.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపించాలని డిమాండ్