Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను తప్పించబోయి బోల్తా పడిన కారు..
Road Accident: పెద్దపల్లి జిల్లాలోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి డివైడర్‌ను...
Road Accident: పెద్దపల్లి జిల్లాలోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన కారులు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యారు. ప్రమాదం గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొందరు వ్యక్తులు తమ కారులో హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్నారు. పెద్దపల్లి జిల్లా గొల్లపల్లి సమీపానికి చేరగానే రాజీవ్ రహదారిపై కారుకు సడెన్‌గా బైక్ అడ్డువచ్చింది. ఆ బైక్‌ను తప్పించబోయిన కారు ఢివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై ఫల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని, చిన్న గాయాలే అని చెప్పారు. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలికి చేరుకున్నారు. రోడ్డుపై అడ్డంగా పడిన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read: