Cows Robbery: చిత్తూరు జిల్లాలో ఆవుల దొంగతనం.. ఆవుల కొట్టంలో తుపాకీ కలకలం..

Cows Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి.

Cows Robbery: చిత్తూరు జిల్లాలో ఆవుల దొంగతనం.. ఆవుల కొట్టంలో తుపాకీ కలకలం..
Chittoor
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 25, 2021 | 2:30 PM

Cows Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్‌లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. అయితే, ఘటన జరిగిన పశువుల కొట్టంలో కంట్రీ మేడ్ రివాల్వర్ లభ్యమవడంతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు. దుండగులు ఒకవేళ తాము దొరికితే కంట్రీమేడ్ రివాల్వర్‌తో జనాలను భయపెట్టి తప్పించుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివాల్వర్‌ను గమనించిన పోలీసులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కాగా, ఈ ముఠా గతంలోనూ తమిళనాడులోని వేలూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన వారిపై దాడులుకు పాల్పడ్డట్లు గుర్తించారు. అలా తుపాకులను వెంటబెట్టుకుని గోవుల దొంగతనాలకు పాల్పడటం.. అడ్డుపడితే దాడులకు తెగబడటం చేస్తుంటారని పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కిరాతక దొంగల ముఠా పట్ల ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారికి సంబంధించిన రివాల్వర్ లభ్యమవడంతో.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఆవుల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Michael Jackson : మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 ఆశ్చర్యకరమైన నిజాలు..! మీకు తెలుసా..?

AP ENC on Srisailam: తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ లేఖ.. శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపించాలని డిమాండ్‌

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!