Indian Navy SSC: ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ.
Indian Navy SSC Recruitment 2021: ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్ నేవీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు...
Indian Navy SSC Recruitment 2021: ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్ నేవీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (శనివారం)తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిషికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఎగ్జిక్యూటివ్ (ఎస్ఎస్‌పీ) పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. * వీటిలో ఎస్‌ఎస్‌సీ జనరల్ సర్వీస్(జీఎస్/ఎక్స్)–47, హైడ్రో కేడర్–03 పోస్టులున్నాయి. * పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* నిజానికి ఈ పోస్టులకు ఎంపికకు రాత పరీక్ష నిర్వహిస్తారు. కానీ కోవిడ్ నేపథ్యంలో ఈసారి రాత పరీక్ష స్థానంలో అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేయనున్నారు. * షార్ట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తుంది. * ఎంపికైన అభ్యర్థులకు శిక్షణను కేరళలోని ఎజిమళ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ)లో ఇస్తారు. * కోర్సుల 2022 జనవరిలో ప్రారంభమవుతుంది. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆనలైన్ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (శనివారం) ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: SBI Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది జూన్ 28
Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!
JNTU Exams: జులైలో బీటెక్, బీఫార్మసీ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన హైదరాబాద్ జేఎన్‌టీయూ..