Karthika Deepam : దీప కాపురం నిలబెడతానంటున్న భాగ్య.. మా పెళ్లి సాక్షి సంతకం సౌందర్య దీపలు చేస్తారంటున్న మోనిత

Karthika Deepam : తెలుగు బిల్లు తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1076వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం.. దీప పిల్లలు మీ ఇంటికి వెళ్లారు

Karthika Deepam : దీప కాపురం నిలబెడతానంటున్న భాగ్య.. మా పెళ్లి సాక్షి సంతకం సౌందర్య దీపలు చేస్తారంటున్న మోనిత
Karthika Deepam
Follow us

|

Updated on: Jun 26, 2021 | 2:40 PM

Karthika Deepam : తెలుగు బిల్లు తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1076వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం.. దీప పిల్లలు మీ ఇంటికి వెళ్లారు అని చెప్పిన విషయంతో .. కార్తీక్ గతంలో తాను దీపకు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటాడు. సౌందర్య దగ్గర కూర్చున్న హిమ, శౌర్యలు తాము చెప్పకుండా వచ్చినట్లు.. అమ్మానాన్నలను చూస్తే విసుగేస్తుంది అని అంటారు. దీంతో షాక్ తిన్న సౌందర్య … పిల్లలు ఇలా మాట్లాడుతున్నారేమిటి.. ఇక వాళ్ళనాన్న మోనిత ను పెళ్లి చేసుకుంటాడు అని తెలిస్తే.. అసహ్యం వేస్తుంది అంటారేమో అని ఆలోచిస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ విసుగు అనిపించరు వాళ్ళ మూడ్ బాగోలేదు.. అందుకే ఆలా ఉన్నారు.. అని చెబుతుంది.

కార్తీక్ వైద్యం వారణాసి వచ్చి.. మోనిత ఉంది మిమ్మల్ని రమ్మంటుంది.. లేకపోతె గొడవ చేస్తుందట.. సైలెంట్ గా వస్తారో.. లేక గొడవలు అవుతాయని చెప్పమన్నారని వారణాసి చెప్పడంతో కార్తీక్.,. మోనిత దగ్గరకు వెళ్తాడు. ఇదంతా విన్న దీప కార్తీక్ వెనుక వెళ్తుంది. భాగ్యం దీపని తాను సరిగ్గా చూసి ఉంటె.. దాని జీవితం బాగుండేది కదా.. బాగా చదివేది.. నేను చదివించి ఉంటె.. మంచి వంటలక్కలా బతకాల్సిన పనిలేకుండా ఉద్యోగం చేసుకునేది.. దాని జీవితం ఇలా కావడానికి నేనే కారణం.. నేనే దీప జీవితం నిలబెడతాను.. మోనిత కు బుద్ధి చెబుతాను అని ఆలోచిస్తుంది

కార్తీక్ మోనిత దగ్గరకు వచ్చి నిలబడతాడు.. నవ్వుతు పలకరించవా అంటే.. నువ్వు వచ్చావని పులకరించాలా అంటాడు.. ఎందుకు ఈ బెదిరింపు.. నాకు దీపకు మధ్య కంచె వేసే ప్రయత్నమా.. లేక పంజరంల్లో బంధించే ప్రయత్నమా అంటాదు.. నాకోసం నువ్వు రావడం లేదు. అందుకే నేను నీకోసం వచ్చా.. నన్ను అవాయిడ్ చేద్దామనుకుంటున్నావా అంటుంది మోనిత. కార్తీక్ పుస్తకం ముసేసినట్లు నీ ఆలోచనలు మూసేశా అంటే.. ఎంతకాలం అలా నేను మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళివచ్చా అంటుంది మోనిత. మా అమ్మ ఇంకా సంస్కారాన్ని మోస్తూనే ఉందా నాలాగా అని కార్తీక్ .. అంటే.. ఎందుకంత కొత్తగా మాట్లాడుతున్నావ్ కార్తీక్ అంటుంది మోనిత

నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు మోనిత పరిచయం లేని ప్రమాదంలా కొన్న కోణంలో కనిపిస్తున్నావు.. ఇంతకు ముందు నా కష్టంలో ఉన్నప్పుడు ఓ స్నేహితురాలిలా కనిపించేదానివి.. ఇప్పుడు అలా లేవు. నడిచే విస్పోటనంలా కనిపిస్తున్నావు.. నిజమే దీప మీద కోపంలో నిన్ను పెళ్లి చేసుకుంటాయని ఆశలు కల్పించాను.. కానీ ఎప్పుడైనా చనువుగా ప్రవర్తించానా.. నువ్వు మన మధ్య ఎదో జరిగిందని చెప్పేవరకూ నాకు తెలియదు.. ఇంకా చెపాలంటే నువ్వు చెప్పింది.. నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా అంటుంటే.. ఇదంతా దీప వింటుంది. కార్తీక్ మాటలకూ మోనిత నవ్వుతుంది.  ఈ 16 ఏళ్ల ప్రేమలో నేను నిన్ను ప్రేమగానే చూశానే తప్ప.. నా శరీరంలో స్పందన కనిపించిందా అని అలా జరిగిపోయింది అంతే అంటుంది. బయటకు వెళ్ళాలి కారు ఎక్కు అని కారు డ్రైవ్ చేయమంటుంది మోనిత.

కార్తీక్ చేసేది లేక మోనిత కోరిక ప్రకారం కారు తనే డ్రైవ్ చేసుకుంటూ మోనితని ఎక్కించుకుని అక్కడ నుంచి వెళ్తుంటే.. ఇదంతా చుసిన దీప ఆవేశంతో అక్కడ నుంచి ఇంటికి తిరిగి వస్తుంది. కారులో మోనితతో నిన్ను చూస్తుంటే నాకు అనీజీగా ఉంది.. అంటే.. నాకు నిన్ను చూస్తే.. నీ జీవితం చక్కబడడం కోసం నీ స్వార్ధం నువ్వు చూసుకునే వ్యక్తివి అనిపిస్తున్నావు అంటుంది మోనిత. నేను నువ్వు కాదంటే.. పల్లి చెట్నీలు.. అమ్ముకోను.. నాకు కావాలిన దానికోసం పోరాడి దక్కించుకుంటా అంటుంది.. జెండర్ ఏదైతే ఏమిటి.. నా ఎజెండా నిజం కాబోతుంది.. నీకు నువ్వేమిటో అర్ధం అవుతుందా అంటే మరీ అంత రాక్షసిలా కనిపిస్తున్నా.. అంటుంటే.. లేదు మానవ బాంబులా కనిపిస్తున్నావు అంటాడు.. కార్తీక్

దీప ఆవేశంతో ఆటోని కడుతుంది..ఆపే ప్రయత్నం చేసిన వారణాసిని తిడుతుంది. ఇంతలో సౌందర్య హిమ, శౌర్యలను తీసుకుని వస్తుంది.

రానున్న ఎపిసోడ్ లో మోనిత సౌందర్య కళ్ళకు మొక్కిన విషయం చెబుతుంది హిమ. మరోవైపు మోనిత కార్తీక్ ని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్తుంది. తన పెళ్ళికి సాక్షులుగా కార్తీక్ అమ్మ .. మొదటి భార్య సంతకాలు పెడతారని చెబుతుంది.. దీంతో కార్తీక్ షాక్ తింటాడు.. మరి నిజంగా 25 న పెళ్లి జరుగుతుందా.. లేక మోనిత చేసిన మోసం బాటపడుతుంటాదా వేసి చూడాలి మరి.

Also Read:

Latest Articles
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని