Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Maa: బడా మూవీలపై ఫోకస్ చేసిన ప్రముఖ ఛానల్.. భారీ సినిమాల శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా..

కరోనా కారణంగా  ప్రపంచం అంతా చిగురుటాకులా వణికింది. ఈ మహమ్మారి దెబ్బకు అన్నీ పరిశ్రమలు కుదేలయ్యాయి.

Star Maa: బడా మూవీలపై ఫోకస్ చేసిన ప్రముఖ ఛానల్.. భారీ సినిమాల శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా..
Tollywood Movies
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 26, 2021 | 3:48 PM

Star Maa: కరోనా కారణంగా  ప్రపంచం అంతా చిగురుటాకులా వణికింది. ఈ మహమ్మారి దెబ్బకు అన్నీ పరిశ్రమలు కుదేలయ్యాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సినిమా షూటింగ్ లన్ని నిలిచిపోయాయి. సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త చక్కబడుతుంది. కరోనా వ్యాప్తి తగ్గుతుండటంతో సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఓ తెలుగు టీవీ ఛానెల్.. బడా మూవీలపై ఫోకస్ చేసింది. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే సినిమాలన్నీ తన బుట్టలో వేసుకుంది. శాటిలైట్స్ రైట్స్ ను కొనేసింది. ఇతర ఛానెళ్లను పోటీలో కూడా లేకుండా చేసేసింది. పోటీ ప్రపంచంలో ప్రతీ క్షణం అలర్ట్ గా ఉండాల్సిందే. కాస్త ఆదరమరిస్తే.. కళ్లముందున్న అవకశాన్ని కూడా గుర్తించలేం. సెకండ్ వేవ్ తో పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదా పడటంతో.. ప్రస్తుతం అవన్నీ తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. మరికొన్ని రోజుల్లో థియేటర్లకు తీసుకురావడానికి.. రిలీజ్ డేట్ల కోసం పోటీ పడుతున్నాయి. అయితే అది గమనించిన ఓ తెలుగు ఛానెల్.. ముందుగానే వాటి శాటిలైట్ రైట్స్ కొనేసింది.

దేశవ్యాప్తంగా మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో సహా.. ఇతర భారీ హీరోల సినిమాలన్నింటి రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రముఖ ఛానల్ స్టార్ మా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేసిన సదరు ఛానెల్.. కొనుగోలు చేసిన మూవీ వివరాలతో ఓ వీడియో కూడా విడుదల చేసింది. రాజమౌళి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ.. పుష్ప, మహేశ్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ సర్కార్ వారి పాట, బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న అఖండ, రవితేజ ఖిలాడీ, నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ, నితిన్ మ్యాస్ట్రో, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాల వరకు.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మూవీస్ శాటిలైట్ రైట్స్ కొనేసినట్లు తెలిపింది స్టార్ మా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవికృష్ణతో రిలేషన్‌షిప్!”.. వైరల్‌గా మారిన నెటిజన్ కామెంట్

పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?రెండు పార్ట్ లుగా ?:Prabhas Salaar movie video.

KGF Garuda Ram : KGF గరుడ కొత్త రూపాన్ని మీరు చూశారా..! మళ్లీ భయంకరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు..