Kanabadutaledu: నేర పరిశోధనలో వీరపనితనం చూపించడానికి కనబడుటలేదు అంటూ రాబోతున్న సునీల్.. టీజర్ టాక్

Sunil Kanabadutaledu : హాలీవుడ్ లోనైనా, బాలీవుడ్ లోనైనా, తెలుగులోనైనా డిటెక్టివ్ కథలతో వచ్చిన ప్రేక్షకులను అలరిస్తుంటాయి. పోలీసులు చేధించలేని కేసులను డిటెక్టివ్ లు..

Kanabadutaledu: నేర పరిశోధనలో వీరపనితనం చూపించడానికి కనబడుటలేదు అంటూ రాబోతున్న సునీల్.. టీజర్ టాక్
Kanabadutaledu
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2021 | 3:14 PM

Sunil Kanabadutaledu : హాలీవుడ్ లోనైనా, బాలీవుడ్ లోనైనా, తెలుగులోనైనా డిటెక్టివ్ కథలతో వచ్చిన ప్రేక్షకులను అలరిస్తుంటాయి. పోలీసులు చేధించలేని కేసులను డిటెక్టివ్ లు తమ తెలివి తేటలతో నేరస్థులను పట్టుకునే తీరు అత్యంత ఆసక్తిని కలిగిస్తాయి. అలనాటి మేటి సినిమా ఏజెంట్ గోపీ నుంచి లేటెస్టుగా `ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌ వరకూ డిటెక్టివ్ కథలతో హిట్ కొట్టిన సినిమాలే.. ఇక వీటన్నిటికీ బిన్నం చంటబ్బాయి.. అయితే తాజాగా హీరో కమ్ సునీల్ డిటెక్టీవ్ గా ప్రేక్షకుల ముందుకు కనబడుటలేదు అంటూ రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఓ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌.. ఇలా సాగే క‌థ ఇది. పోలీసుల‌కు అంతుప‌ట్ట‌ని ఈ కేసు.. డిటెక్టీవ్ ఎలా చేధించాడనేది ఈ సినిమా..పోలీసులకు, డిటెక్టివ్ లకు తేడా ఏంటో సునీల్ ద్వారా చెప్పించాడు డైరెక్టర్. నేర ప‌రిశోధ‌న చిత్రాలు ఎలా ఉంటాయో.. ఆ ఫార్మెట్ లోనే క‌నిపించింది. టీజ‌ర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌… అన్నీ బాగున్నాయి. కమెడియన్ గా డుగు పెట్టిన సునీల్ తర్వా హీరోగా కూడా సూపర్ హిట్ అందుకున్నాడు.. మళ్ళీ రూట్ మర్చి విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ నేపధ్యంలో డిటెక్టివ్ అనేది కొత్త ఛాలెంజింగ్ పాత్ర.. మరి సునీల్ ఎలా మెప్పించాడో చూడాలి మరి. ఈ చిత్రానికి ఎం.బాలరాజు దర్శకుడు. కనబడుటలేదు చిత్రాన్ని స్పార్క్ ఓటీటీ విడుదల చేయనున్నారు.

Also Read:  దీప కాపురం నిలబెడతానంటున్న భాగ్య.. మా పెళ్లి సాక్షి సంతకం సౌందర్య దీపలు చేస్తారంటున్న మోనిత