Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Garuda Ram : KGF గరుడ కొత్త రూపాన్ని మీరు చూశారా..! మళ్లీ భయంకరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు..

KGF Garuda Ram : కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్,

KGF Garuda Ram : KGF గరుడ కొత్త రూపాన్ని మీరు చూశారా..! మళ్లీ భయంకరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు..
Kgf Garuda Ram
Follow us
uppula Raju

|

Updated on: Jun 26, 2021 | 2:05 PM

KGF Garuda Ram : కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కి కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఇందులో విలన్‌గా నటించిన నటుడు రామ్ అలియాస్ గరుడ రామ్‌కు భారీ ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు అతడు ఇండస్ట్రీలో టాప్ విలన్‌గా మారిపోయాడు. తాజాగా శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా – సిద్దార్ధ్ – అదితి – అనూ ఇమాన్యూయేల్ – జగపతిబాబు, రావు రమేశ్‌ ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలయ పాత్ర చేస్తున్న కేజీఎఫ్‌ ఫేమ్‌ గరుడ రామ్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన ధనుంజయ్‌ అను విలన్‌ పాత్రని చేస్తున్నాడు. ఇందులో ఒక రాక్షస రాజులా కనిపించనునున్నాడు. ఈ సందర్భంగా చిత్ర మేకర్స్ మాట్లాడుతూ.. మహాసముద్రం సినిమాలో గరుడ రామ్‌ని భయంకరమైన విలన్‌గా చూపిస్తున్నామని తెలిపారు. ధనంజయ్ అనే క్రూరమైన వ్యక్తిగా పరిచయం చేస్తున్నామన్నారు.

సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తున్న రామ్ ఈ సినిమాలో ఎలా నటించాడో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టాలీవుడ్‌లో రామ్ చేసిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రం విడుదలైన తర్వాత రామ్‌కి తెలుగు అభిమానుల సంఖ్య పెరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కన్నడ, తమిళ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న మహాసముద్రం చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

Maoist Sharadakka: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ భార్య శారదక్క కరోనా మృతి.. ఆయన చనిపోయిన 4రోజులకే మరో విషాదం!

Realme Laptop with Windows 11: విండోస్ 11 తో రానున్న రియల్‌మీ ల్యాప్‌టాప్..!

ఏలియన్స్‌ ఉంటే కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు!లీసా కాల్టేనెగర్‌ వివరణ :Aliens.