Suriya: జ్యోతిక లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను.. ఏడిపించేసిన సూర్య..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు సూర్య. ఈ సందర్భంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు.

Suriya: జ్యోతిక లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను.. ఏడిపించేసిన సూర్య..
Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2024 | 3:45 PM

తమిళ్ హీరోలకు తెలుగులో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా హీరో సూర్యకు ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. యూత్‏ ఫేవరేట్ స్టా్ర్ ఈ హీరో. ఇప్పటివరకు సూర్య నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కంగువ సినిమాతో మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు రాబోతున్నారు. నవంబర్ 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. చిత్రయూనిట్ తో కలిసి ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా నందమూరి హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లో సూర్య పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కంగువ ముచ్చట్లతోపాటు పర్సనల్ లైఫ్, తమ్ముడు కార్తీ, తన వైఫ్ జ్యోతిక, ఫ్యామిలీ గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా విడుదలైన అన్‌స్టాపబుల్ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

కార్తీ, సూర్య మధ్య ఉండే రిలేషన్ గురించి.. వారిద్దర మధ్య ఉండే ప్రేమను బయట పెట్టాడు బాలయ్యి. కార్తీతో ఫోన్ కాల్ చేయించి సూర్యను ఆటపట్టించాడు బాలయ్య. ఇక కార్తీ కూడా సూర్యకు సంబంధించిన సీక్రెట్స్ బయటపెట్టాడు. చిన్నప్పటి నుంచి అన్న అబద్దాలే చెబుతాడని కార్తీ కంప్లైంట్ చేయగా.. నువ్వు కార్తీ కాదు రా కత్తి అంటూ సూర్య కౌంటరిచ్చాడు. అలాగే సూర్యకు ఓ హీరోయిన్ అంటే క్రష్ అని చెప్పాడు. ఇక ఆ తర్వాత సూర్య తన భార్య జ్యోతిక గురించి చెప్పుకోచ్చాడు. జ్యోతిక లేుండా తన లైఫ్ అస్సలు ఊహించుకోలేనని.. ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే సూర్య పెట్టిన ఫౌండేషన్, ఉచిత విద్య, పిల్లల వీడియోస్ ప్లే చేయగా.. అందులో ఓ అమ్మాయి చెప్పిన మాటలకు సూర్య ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నిజానికి సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక బెస్ట్ కపూల్స్ అని అంటుంటారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక.. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం హిందీలో అవకాశాలను అందుకుంటుంది జ్యోతిక. అలాగే అటు నిర్మాతగానూ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.