AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తోఎ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 25 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 01, 2025 | 8:55 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, ఇంగ్లిష్ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇందులో ఓ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. కొన్ని రోజుల క్రితమే థియేటర్ల లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠ కలిగించే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు సుమారు రూ. 25 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో మణి (జీవీ ప్రకాష్) చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుంటాడు. సునీతా (తేజు అశ్విని) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఒక రోజు మణికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. నీది ఒక ప్రైవేట్ వీడియో నా దగ్గర ఉందని బ్లాక్ మెయిల్ చేస్తాడు. 5 లక్షలు ఇవ్వు, లేదంటే సునీతాకు, ఆఫీసుకు ఈ వీడియోను పంపుతానని బెదిరిస్తాడు. దీంతో మణి బాగా భయపడతాడు. సునీతకు కూడా చెప్పలేక తనలో తాను మథన పడతాడు. చివరికీ ఏం చేయలేక భయంతో రూ. 5లక్షల డబ్బును ఇచ్చేస్తాడు. కానీ మణికి మళ్లీ ఫోన్ కాల్స్ వస్తాయి. ఈసారి మరో 10 లక్షలు డిమాండ్ చేస్తాడు. మరో వైపు మరో ఇద్దరికీ కూడా ఇదే తరహా బ్లాక్ మెయిల్ కాల్స్ వస్తాయి. మరి ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు? మణి ప్రైవేట్ వీడియోలు అతనికి ఎలా చిక్కాయి? అసలు వీళ్లంతా ఒకే బ్లాక్ మెయిర్ కు ఎలా టార్గెట్ అయ్యారు? చివరికీ ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘బ్లాక్‌ మెయిల్’. మ్యూ మారన్ తెరకెక్కించిన ఈ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్, బిందు మాధవి, తేజు అశ్విని, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జయకొడి అమల్‌రాజ్ నిర్మించారు. సుమారు 2 గంటల 15 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర సినిమా చూడాలనుకునేవారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్