Bhuj: నా చావు గురించి చింతించకండి, నేను చావడానికే పుట్టాను.. భారతీయుల గుండెలు ఉప్పొంగేలా భూజ్ ట్రైలర్.
Bhuj Trailer: 1971లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం భూజ్. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యుద్ధం జరిగిన...
Bhuj Trailer: 1971లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం భూజ్. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యుద్ధం జరిగిన సమయంలో గుజరాత్‌లోని భూజ్ అనే ఎయిర్‌పోర్ట్ పాకిస్తాన్ దాడి చేస్తుంది. ఆ సమయంలోనే ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ స్థానిక మహిళల సహాయంతో ధ్వంసమైన ఎయిర్ పోర్ట్ రన్‌వేను బాగు చేసి భారత సైన్యం ఉపయోగించుకునేలా తీర్చి దిద్దుతారు.. ఆ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ విజయ్ పాత్రలోనే అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఇక స్థానిక మహిళలను ఒక్కతాటికిపైకి తీసుకొచ్చిన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి నటిస్తున్నారు. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 13న హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది.
3.21 నిమిషాల వ్యవధితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 1971లో యుద్ధాన్ని మేకర్స్ ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సినిమాలో పాత్రలు పలికే డైలాగ్‌లు భారతీయుల గుండెలు ఉప్పొంగేలా చేశాయి. ముఖ్యంగా’ మరాఠాలకు చావడం లేదా చంపడం.. ఈ రెండే తెలుసు’, ‘చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటాం’, ‘నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక సోనాక్షి చెప్పే.. ‘శ్రీ కృష్ణుడు చెప్పినట్లు ఇతరుల ప్రాణాలను కాపడానికి చేసే హింస కూడా ధర్మమే’, ‘సూర్యుడు ప్రకాశిస్తున్నని రోజులు హిందుస్థాన్ వర్ధిల్లుతుంది’ డైలాగ్‌లు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. మొత్తం మీద ఎమోషనల్ జర్నీగా ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమాలో తమిళ బ్యూటీ ప్రణీతా సుభాష్ కూడా నటిస్తున్నారు.